MLA Prasanna Kumar Reddy : నేను చనిపోయే వరకు జగన్ తోనే.. పార్టీ మారుతున్నట్లు ప్రచారం చంద్రబాబు మైండ్ గేమ్ : ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

వైసీపీ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. వైసీపీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తాను చనిపోయే వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.

MLA Prasanna Kumar Reddy : నేను చనిపోయే వరకు జగన్ తోనే.. పార్టీ మారుతున్నట్లు ప్రచారం చంద్రబాబు మైండ్ గేమ్ : ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

Prasanna Kumar Reddy

MLA Prasanna Kumar Reddy : వైసీపీ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. వైసీపీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తాను చనిపోయే వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను చనిపోతే తన కుమారుడు రజత్ రెడ్డి కూడా జగన్ తోనే ఉంటారని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం చంద్రబాబు చేస్తున్న కుట్ర అని అన్నారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం.. చంద్రబాబు మైండ్ గేమ్ అని పేర్కొన్నారు.

తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదని ఏనాడూ బాధపడలేదన్నారు. చివరికి ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.
కావాలని ఏదో విధంగా గందరగోళం సృష్టించి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని.. అందంతా అవాస్తవం అన్నారు. వైసీపీ పార్టీ స్థాపించని తర్వాత వైఎస్ జగన్ ఎంపీగా గెలిచిన తర్వాత విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీలో తాను రెండో ఎమ్మెల్యేనని తెలిపారు.

CM Jagan Fix Target : 175 గెలవాల్సిందే.. వైసీపీ నేతలకు జగన్ బిగ్ టార్గెట్

అయినా కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఏ రోజు బాధపడలేదన్నారు. తాను సంతోషంగా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల మధ్యలో ఉన్నానని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలను జగన్ మోహన్ రెడ్డికి చెప్పిన పరిష్కరించుకుంటున్నానని వెల్లడించారు. తనది రాజీయ కుటుంబం అన్నారు. తాను ఎప్పుడు కూడా ఈ భాష ఉపయోగించ లేదన్నారు.

ఒకవేళ తాను చనిపోయినా తన కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రతి ఒక్కరినీ జగన్ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీలో ఎవరు కూడా అసంతృప్తి నేతలు లేరని స్పష్టం చేశారు. వైసీపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తే బయటికి వెళ్లిపోయారని ఆరోపించారు. సీఎం జగన్ బొమ్మతో గెలిచామని, నిజాయితీగా ఉండాలని పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలకు ఉండాలని చెప్పారు.