Manchu Mohanbabu: నేను ఏమీ మాట్లాడను.. నన్ను వదిలేయండి.. కోర్టుకు హాజరైన మంచు కుటుంబం..

సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు ఆయన కుమారులు మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సెంటర్ నుంచి వారు పాదయాత్రగా వెళ్లి కోర్టుకు హాజరయ్యారు.

Manchu Mohanbabu: నేను ఏమీ మాట్లాడను.. నన్ను వదిలేయండి.. కోర్టుకు హాజరైన మంచు కుటుంబం..

Mohan Babu (1)

Manchu Mohanbabu: సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు ఆయన కుమారులు మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సెంటర్ నుంచి వారు పాదయాత్రగా వెళ్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరు సందర్భంగా, కోర్టు వెలుపలసైతం మోహన్ బాబు విద్యాసంస్థల విద్యార్థులు, అభిమానులు, వివిధ రాజకీయ పక్ష నేతలతో కలిసి ర్యాలీగా కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ప్రయాణీకులు, న్యాయవాదులు, కక్షీదారులు కొద్దిసేపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలాఉంటే కేసు విచారణ అనంతరం సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది.

Mohan Babu: నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్న మోహన్ బాబు, ఆయన కుమారులు

కోర్టు వెలుపలకు వచ్చిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.. కోర్టు సమన్లు తనకు అందలేదని, అయినా న్యాయాధిపతి రమ్మని పిలిచారని, న్యాయమూర్తి ఎదుట హాజరైన సంతకం చేశామని తెలిపారు. తదుపరి విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేసినట్లు తెలిపారు. నిజం చెప్పాలంటే.. పిలిచారు, వచ్చాను, చూశాను, సంతకం పెట్టాము, బయలుదేరుతున్నాము.. అందరికి నమస్కారం అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని

కోర్టుకు పాదయాత్రగా వెళ్లడంపై స్థానిక విలేకరులు ప్రశ్నించగా.. పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు, కారులో వచ్చి అక్కడ దిగాము. జనం ఉన్నారు. మనకోసం వచ్చిన వారిని ప్రేమించాలి, హ్యాపీగా వాళ్లతో నడిచి వచ్చి కోర్టు లోపలికి వెళ్లామని మోహన్ బాబు బదులిచ్చారు. నేనుఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయను, దీనిపై నేను ఏం మాట్లాడినా కాంట్రవర్శీ అవుతుంది, అందుకే నేను ఎక్కువగా మాట్లాడను అంటూ మోహన్ బాబు వెళ్లి పోయారు.