Mohan Babu: నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్న మోహన్ బాబు, ఆయన కుమారులు

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు నేడు (మంగళవారం) తిరుపతి కోర్టుకు హాజరు కానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది.

Mohan Babu: నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్న మోహన్ బాబు, ఆయన కుమారులు

Mohan Babu

Mohan Babu: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు నేడు (మంగళవారం) తిరుపతి కోర్టుకు హాజరు కానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది.

Mohan Babu: వాళ్లు నాశనమైపోతారు.. మోహన్ బాబు శాపనార్థాలు

అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్ లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తు పోలీస్ అనుమతి లేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

New Rules: జూలై 1 నుంచి ఆ మూడు విభాగాల్లో కొత్త రూల్స్.. తప్పనిసరిగా పాటించాల్సిందే?

ఈ క్రమంలో నేడు తిరుపతి కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. అయితే.. మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ లు ఉదయం 10 గం.లకు తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు అభిమానులతో కలిసి కోర్టు కు పాదయాత్రగా వెళ్లనున్నారు.