Andhra Pradesh : ప్రేమకు నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..తర్వాత

ప్రేమించాలంటూ ఒకడు.. పెళ్లి చేసుకోవాలంటూ మరొకడు.. అనుమానంతో ఇంకొకడు.. కోర్కెలు తీర్చాలంటూ మరొకడు. ఇలాంటి ప్రేమోన్మాదుల దుర్మార్గాలకు అభం శుభం తెలియని ఆడవాళ్లు అసువులు బాస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలతో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు.

Andhra Pradesh : ప్రేమకు నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..తర్వాత

Andhra Pradesh

Man Cuts Girl Throat : ప్రేమించాలంటూ ఒకడు.. పెళ్లి చేసుకోవాలంటూ మరొకడు.. అనుమానంతో ఇంకొకడు.. కోర్కెలు తీర్చాలంటూ మరొకడు. ఇలాంటి ప్రేమోన్మాదుల దుర్మార్గాలకు అభం శుభం తెలియని ఆడవాళ్లు అసువులు బాస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో…పరిపక్వత లేని ప్రేమలతో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ప్రేమలో విఫలమైతే జీవితమే ముగిసినట్లు.. హత్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఓ ప్రేమోన్మాద ఘటన చిత్తూరులో జరిగింది. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రికలో ప్రేమను నిరాకరించిందనే కోపంతో చిన్నా అనే యువకుడు.. సుష్మా అనే అమ్మాయి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.

ప్రేమిస్తున్నాంటూ వేధింపులు : –
సాంబయ్య కండ్రికకు చెందిన సుష్మా, చిన్నా కుటుంబాలు.. ఎదురెదురు ఇళ్లలోనే ఉంటాయి. సుష్మ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తోంది. సుష్మ అంటే చిన్నాకు చాలా ఇష్టం. చాలా కాలంగా ఆమెను ప్రేమిస్తున్నాడు. మొదట్లో సుష్మ కూడా చిన్నాతో మామూలుగానే మాట్లాడేది. కానీ చిన్నా తనను ప్రేమిస్తున్నాడన్న విషయం తెలియడంతో అతన్ని దూరం పెడుతూ వచ్చింది. తనకు ఇష్టం లేదని.. తన వెంట తిరగొద్దని చాలా సార్లు వార్నింగ్‌ కూడా ఇచ్చింది. కానీ చిన్నా బుద్ధి మార్చుకోలేదు. ఎలాగైనా సుష్మ తన ప్రేమను అంగీకరించేలా చేయాలని.. రాక్షస ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు : –
కాలం గడిచే కొద్దీ చిన్నా వేధింపులు ముదిరాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా చిన్నా పద్ధతి మార్చుకోకపోవడంతో సుష్మకు ఓపిక నశించింది. కొన్ని రోజుల క్రితం చిన్నాపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో చిన్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అప్పటి నుంచి చిన్నా.. సుష్మపై కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమను అంగీకరించలేదనే కోపం.. తనను పోలీస్‌ స్టేషన్‌కు పంపించిందనే కక్షతో.. సుష్మపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

నిద్రిస్తున్న యువతి గొంతు కోశాడు : –
ఎలాగైనా సుష్మ తనకు దక్కదని నిర్ణయించుకున్నాడు. తన ప్రేమను అంగీకరించని యువతి బతికి ఉండకూడదనుకున్నాడు. తెల్లవారుజామునే ఎవరూ చూడకుండా సుష్మ ఇంట్లోకి వెళ్లాడు. నిద్రిస్తున్న యువతిని గొంతు కోసి కిరాతకంగా చంపాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటికే మేల్కొన్న సుష్మ కుటుంబ సభ్యులు.. చిన్నాను రాళ్లతో కొట్టి చంపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నా మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ప్రేమను అంగీకరించని కారణంగానే హత్య చేసినట్టు కేసు నమోదు చేసుకున్నారు. క్షణికావేశంలో చిన్నా చేసిన పనికి తన ప్రాణాలు పోవడమే కాకుండా.. మరో కుటుంబానికి కూడా తీరని శోకాన్ని మిగిల్చాడు.