Aided Schools : ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత.. మంత్రి కీలక ప్రకటన

రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత లేదా ప్రభుత్వానికి అప్పగింత వ్యవహారం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై రచ్చ..

Aided Schools : ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత.. మంత్రి కీలక ప్రకటన

Aided Schools

Aided Schools : రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత లేదా ప్రభుత్వానికి అప్పగింత వ్యవహారం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై రచ్చ జరుగుతోంది. దీంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు.

ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై కమిటీ వేశామని మంత్రి చెప్పారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని స్పష్టం చేశారు. విద్యాసంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని వివరించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని అ‍న్నారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఒక వేళ ప్రైవేట్‌ విద్యా సంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకోవచ్చని మంత్రి సురేష్‌ అన్నారు. అయితే, ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

”కొన్ని చోట్ల కనీస వసతులు లేవు. తల్లిదండ్రులపై ఎలాంటి బలవంతపు ఒత్తిడి చేయడం లేదు. విద్యార్థులకు.. దగ్గరలో ఉన్న స్కూల్స్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తాం. దీనిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసతులు కల్పించకుండా పోస్టులు ఖాళీగా ఉంచింది. నాణ్యమైన విద్యను అందించడానికి సీఎం కృషి చేస్తున్నారు” అని మంత్రి అన్నారు.

కార్పొరేట్‌కు ధీటుగా విద్యా విధానం ఉండాలనేదే తమ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి ఓ‍ర్వలేక.. ప్రతిపక్షాలు ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం దుర్మార్గమని మంత్రి సురేష్ వాపోయారు.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

ఏపీలో ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం విద్యాసంస్థలకు ఇచ్చే గ్రాంటును ప్రభుత్వం ఉప సంహరించుకుంటుంది. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలను అన్ ఎయిడెడ్ చేయాలి లేదా ప్రభుత్వానికి అప్పగించాలి. దేవాదాయశాఖలోని ఛారిటబుల్‌ ట్రస్టులు, ఆలయాల నిర్వహణలో ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో… 11 సంస్థలను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. నాలుగు ట్రస్టులకు చెందిన 10 విద్యాసంస్థలు, ఒక వసతిగృహాన్ని… ప్రాంగణాలు, బోధన, బోధనేతర సిబ్బంది సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు వాటి ఈవోలు, కరస్పాండెంట్లు ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో 20 విద్యాసంస్థలు మాత్రం గ్రాంటును వదులుకుని, ప్రైవేటుగా కొనసాగేందుకు మొగ్గుచూపాయి.