3 రాజధానులు అందుకే.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలి : అసెంబ్లీలో CRDA రద్దు బిల్లు

అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 07:59 AM IST
3 రాజధానులు అందుకే.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలి : అసెంబ్లీలో CRDA రద్దు బిల్లు

అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం(జనవరి 20,2020) ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. దీనిపై స్పీకర్ చర్చ చేపట్టారు. దీనిపై మాట్లాడిన మంత్రి బొత్స.. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాల వారికి, అందరికి దక్కాలనేది జగన్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని మంత్రి బొత్స చెప్పారు.

పరిపాలన వికేంద్రీకరణ జరగాలని జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ కమిటీలు నివేదికలు ఇచ్చాయని మంత్రి వివరించారు. రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం ఏపక్షంగా నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స మండిపడ్డారు. మూడు ప్రాంతాల అవసరాలను గుర్తించ లేదన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారని బొత్స వివరించారు.

బొత్స కామెంట్స్:
* చంద్రబాబు బాగుంటే రాష్ట్రమంతా బాగున్నట్టేనా..?
* 28వేల మంది 34వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు
* పట్టా రైతులకు సమానంగా అసైన్డ్ రైతులకు ఇస్తాం
* రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు 10 నుంచి 15ఏళ్లకు పెంపు
* రైతులకు కౌలు పరిహారం రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంపు

* పట్టా భూములిచ్చిన రైతులకు వెయ్యి గజాల ఇంటి స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం
* అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలి
* రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి
* అందరూ చంద్రబాబులాగే బినామీ పేర్లతో భూములు కొన్నారు
* రైతులతో ఉన్న గత ఒప్పందాలు కొనసాగిస్తాం

* అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి
* సమగ్ర రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు
* ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని అందరూ గుర్తించాలి
* అన్ని ప్రాంతాల అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం గుర్తించలేదు
* శివరామకృష్ణన్ కమిటీ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు
* టీడీపీ ప్రభుత్వం ఏపక్షంగా నిర్లక్ష్యమైన నిర్ణయాలు తీసుకోలేదు
* ప్రాంతీయ అసమానతలు, అవసరాల వల్లే రాష్ట్ర విభజన జరిగింది