Minister Kakani Govardhan Reddy: మా ఇష్టారీతిలో ఓటేస్తామంటే కుదరదు.. జగన్ వెంటే నెల్లూరు ప్రజలు

పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెన్షన్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారని మంత్రి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, పార్టీ శాశ్వతమని, వెళ్లిపోయే వారు పోతారని అన్నారు.

Minister Kakani Govardhan Reddy: మా ఇష్టారీతిలో ఓటేస్తామంటే కుదరదు.. జగన్ వెంటే నెల్లూరు ప్రజలు

minister Kakani govardhan Reddy

Minister Kakani Govardhan Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్‌ (Cross voting) కు పాల్పడ్డారన్న నిర్ధారణకు వచ్చాకే వైసీపీ అధిష్టానం (YCP leadership) వారిపై చర్యలు చేపట్టిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా చేశారు కాబట్టే చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్లిపోయిన వెంటనే పార్టీ బలహీన పడదని, మా ఇష్టారీతిలో ఓటు వేసుకుంటాం అంటే కుదరదని, ప్రజల్లో మరింత బలహీన పడతారని మంత్రి కాకాని అన్నారు.

Minister Kakani : ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు మ్యాన్ ట్రాప్.. కోటంరెడ్డిపై మంత్రి కాకాని, ఆదాల ఫైర్ ..

పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెన్షన్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారని మంత్రి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, పార్టీ శాశ్వతమని, వెళ్లిపోయే వారు పోతారని అన్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేముందు షోకాజు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కొందరు ప్రశ్నిస్తున్నారని, షోకాజ్ నోటీస్ ఇవ్వాలని లేదని, ఇది రాజ్యాంగ బద్ధమైన పదవులు కావని తెలుసుకోవాలని కాకాని సూచించారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నవారు పార్టీపై బురద జల్లడం సర్వసాధారణమన్నారు.

Kotamreddy Sridhar Reddy: 2024లో వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డిస్మిస్ అవడం ఖాయం ..

మేము వైసీపీలోనే ఉన్నామని, మాకెవ్వరికీ సమస్యలు లేవు, వారికే ఎందుకు అంటూ మంత్రి కాకాని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు ఎవరికుంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు. టీడీపీ నాయకులు కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. గత ఎన్నికల్లో‌కూడా టీడీపీ వార్ వన్ సైడ్ అనుకుంది, విజయం తమదే అనుకుంది. కానీ, వార్ వన్ సైడే అయినా అది వైసీపీ పక్షాన జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.