Kodali Nani : పవన్ కళ్యాణ్‌ను అభినందించిన కొడాలి నాని.. మోదీకి జానీ సినిమా చూపించాలని సూచన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభినందించడం ఏంటనే సందేహం వచ్చింది కదూ. అలాంటి సందేహం రావడంలో తప్పు లేదు. అవును, పవన్ ను నాని అభినందించారు.

Kodali Nani : పవన్ కళ్యాణ్‌ను అభినందించిన కొడాలి నాని.. మోదీకి జానీ సినిమా చూపించాలని సూచన

Kodali Nani

Kodali Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభినందించడం ఏంటనే సందేహం వచ్చింది కదూ. అలాంటి సందేహం రావడంలో తప్పు లేదు. అవును, పవన్ ను నాని అభినందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడానికి పవన్ కల్యాణ్ ఇప్పటికైనా ముందుకొచ్చారని… ఈ విషయంలో ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కొడాలి నాని చెప్పారు. జనసేన అధినేతకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిందని ఎద్దేవా చేశారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

అదే సమయంలో పవన్ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు పైన తనదైన స్టైల్ లో మరోసారి ఫైర్ అయ్యారు కొడాలి నాని. రాష్ట్రంలో వారిద్దరికి భయపడేవారు ఎవరూ లేరని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జనసేన అనేది ఒక చనిపోయిన పార్టీ అని… అలాంటి పార్టీ తమకు డెడ్ లైన్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చచ్చిపోయిన పార్టీ డెడ్ లైన్లు కాక ఏం పెడుతుందని సెటైర్లు వేశారు. మీకు అంత దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి డెడ్ లైన్లు పెట్టాలని సవాల్ చేశారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఒక్క చోట కూడా గెలవలేదని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

”రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టడం కాదు. ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీకి డెడ్ లైన్లు పెట్టాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ.. గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్లకు చూపించాలి. వాటిని చూసి నరేంద్ర మోదీ భయపడతారేమో చూడాలి ” అని కొడాలి నాని అన్నారు.

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆదివారం పవన్ కళ్యాణ్ సభ నిర్వహించిన సంగతి తెలిసింది. ఆ సభలో జగన్ ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్ పెట్టారు పవన్. వారం టైమ్ ఇస్తున్నా.. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించాలన్నారు. వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన కార్యచరణ ప్రకటిస్తానని పవన్ హెచ్చరించారు. పవన్ చేసిన డెడ్ లైన్ కామెంట్స్‌కు మంత్రి కొడాలి నాని ఘాటుగా బదులిచ్చారు.