Vijayawada: మహా పూర్ణాహుతి.. సీఎం జగన్, స్వామీజీలు వస్తారు: మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో అమ్మవారి అనుగ్రహం, అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని చెప్పారు.

Vijayawada: మహా పూర్ణాహుతి.. సీఎం జగన్, స్వామీజీలు వస్తారు: మంత్రి కొట్టు సత్యనారాయణ

Minister Kottu Satyanarayana

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తోన్న అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన శ్రీలక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమం 5 రోజులూ కూడా శాస్త్రోక్తంగా జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో అమ్మవారి అనుగ్రహం, అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని చెప్పారు. 17న మహా పూర్ణాహుతి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా రాజశ్యామల, మహాలక్ష్మీ యాగశాలల్లో రేపు సీఎం జగన్ పాల్గొంటారని అన్నారు. కంచి నుంచి తెచ్చిన వస్త్రాలను అమ్మవారికి జగన్ అందిస్తారని చెప్పారు.

రేపటి కార్యక్రమానికి స్వరూపానంద స్వామితో పాటు గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి హాజరవుతారని తెలిపారు. అలాగే, చిన జీయర్ స్వామి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామన్నారు. ప్రకృతి సహకారంతో యజ్ఞం విజయవంతంగా జరిగిందని చెప్పారు.

ఇటువంటి యజ్ఞం భారత దేశంలో ఎక్కడా జరుగలేదని తెలిపారు. ఎనిమిది ఆగమాలు సంపుటీకరించుకుని ఒకేసారి ఎప్పుడూ చేయలేదన్నారు. ఎండను లెక్కచేయకుండా భక్తులు వచ్చి ప్రదిక్షణ చేసి ప్రసాదం తీసుకున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యజ్ఞం గురించి చర్చించుకుంటున్నారన్నారు.

CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్‌ పొలిటికల్‌ పాఠాలు