OLXలో జనసేన : పవన్ రాజకీయం చూసి చంద్రబాబే షాక్ అయ్యారు

బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ పచ్చి అవకాశవాది అని మంత్రి పేర్నినాని అన్నారు. అవకాశవాద

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 12:27 PM IST
OLXలో జనసేన : పవన్ రాజకీయం చూసి చంద్రబాబే షాక్ అయ్యారు

బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ పచ్చి అవకాశవాది అని మంత్రి పేర్నినాని అన్నారు. అవకాశవాద

బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ పచ్చి అవకాశవాది అని మంత్రి పేర్నినాని అన్నారు. పవన్ ను మించిన అవకాశవాది ఎవరూ లేరన్నారు. అవకాశవాద రాజకీయంలో పవన్ చంద్రబాబుని మించిపోయారని విమర్శించారు. పవన్ అవకాశవాద రాజకీయం చూసి చంద్రబాబే షాక్ అయ్యారని మంత్రి పేర్నినాని అన్నారు. ఇప్పటివరకు అవకాశవాద రాజకీయాలు చంద్రబాబు చేసేవారు.. ఇప్పుడు ఆ పాత్రను పవన్ తీసుకున్నారని మంత్రి విమర్శించారు. అవకాశవాదానికి కొత్త చిరునామా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని పవన్ దత్తత తీసుకున్నారని విమర్శలు చేశారు. లోకేష్ పై చంద్రబాబుకి నమ్మకం లేదు కాబట్టే.. పవన్ ను చేరదీస్తున్నారని మంత్రి పేర్నినాని అన్నారు.

OLXలో జనసేన:
బేషరుతుగా బీజేపీతో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ ను మంత్రి నిలదీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అంశాలపై ఎందుకు షరతులు పెట్టలేదని ప్రశ్నించారు. పవన్ తన పార్టీని ఓఎల్ ఎక్స్ లో పెట్టారని మంత్రి విమర్శించారు. ఓఎల్ఎక్స్ లో పాత వస్తువులు పెడతారని తెలుసు.. కానీ ఓ రాజకీయ పార్టీని కూడా ఓఎల్ఎక్స్ లో పెట్టొచ్చని పవన్ నిరూపించారని మంత్రి ఎద్దేవా చేశారు. ఓఎల్ ఎక్స్ పార్టీ చీఫ్ పవన్ చెప్పేదొకటి, చేసేదొకటని మంత్రి అన్నారు. పూటకో మాట మాట్లాడేవారికి విలువ ఉండదన్నారు. 2014లో సీట్లు గెలవలేని పవన్.. 2024 లో ఏం గెలుస్తారని మంత్రి ప్రశ్నించారు.

బీజేపీతో పవన్ పొత్తు : చంద్రబాబు గేమ్ ప్లాన్
బీజేపీ-జనసేన పొత్తు చంద్రబాబు గేమ్ ప్లాన్ అని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు ఏం చెబితే.. ప్రజాశాంతి, కాంగ్రెస్, ఓఎల్ఎక్స్(జనసేన) పార్టీలు అవి చేస్తాయని మంత్రి అన్నారు. వైసీపీకి ప్రజలతోనే పొత్తు ఉంటుందని, మాకు ప్రజలే కావాలని మంత్రి స్పష్టం చేశారు.

పవన్ ను జనం నమ్మరు:
మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం పవన్ పై విమర్శలు చేశారు. ఎన్నికలు ముగిసి 6 నెలలు కాకుండానే.. పార్టీని నడపలేక పవన్ చేతులెత్తేశారని అన్నారు. వామపక్ష భావజాలం పేరుతో జనసేన పెట్టిన పవన్.. అందుకు భిన్నంగా వేరే వారితో చేతులు కలిపారని మండిపడ్డారు. ఉన్న ఒక్క సీటును కూడా నిలుపుకోలేని పవన్ ను జనం నమ్మరని చెప్పారు. ఎన్నికలకు ముందే టీడీపీకి పవన్ దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు. పవన్ గుంపుగా వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరని మంత్రి అనిల్ అన్నారు.

మోడీ ఫ్రెష్ లడ్డూ ఇచ్చారా..?
ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూ అని ప్రధాని మోడీపై ధ్వజమెత్తిన పవన్ కు.. ఇవాళ జీడిపప్పు, కిస్ మిస్ తో మోడీ ఫ్రెష్ లడ్టూలు పంపారా అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే పవన్.. హోదా అడక్కుండా బీజేపీతో బేషరతుగా ఎందుకు కలసి పనిచేస్తానని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. గతంలో ఎన్నో కూటములు పెట్టారు… అయినా వైసీపీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. చంద్రబాబు సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా మీకు జగనే టార్గెట్ అన్నారు. సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్ళని చంద్రబాబు బీజేపీలోకి పంపారు.. ఇప్పుడు మీరు బీజేపీతో కలిశారు.. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Also Read : నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు ఉరి