Minister Roja: చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్.. బీఆర్ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు, లోకేశ్‌కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు రాదు. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందంటూ ఏపీ మంత్రి రోజా అన్నారు.

Minister Roja: చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్.. బీఆర్ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Roja

Minister Roja: లోకేశ్ పాదయాత్ర ఫెయిల్యూర్ యాత్ర అని, నారా లోకేశ్‌వి పిల్ల చేష్టలు అంటూ ఏపీ మంత్రి రోజా విమర్శించారు. 10టీవీతో మాట్లాడిన రోజా.. టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర జనంలేక వెలవెలబోతుందని, కేవలం బందోబస్తుకు వచ్చిన పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్ చేష్టలతో టీడీపీ రోజురోజుకు పాతాళానికి పడిపోతుందని, దీన్ని జీర్ణించుకోలేని లోకేశ్ ఫ్రస్టేషన్‌లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు తేలేదని, అభివృద్ధి జరగలేదని వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తూ, అదీచాలక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులపైనా లోకేశ్ నోరుపారేసుకుంటున్నాడంటూ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, నిరుద్యోగులకు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయని రోజా అన్నారు.

Minister Roja: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ తెలుగుదేశం పార్టీని దొంగిలించిన దొంగలు అని, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తండ్రి పెట్టలేదని, నందమూరి తారకరామారావు పెట్టారని రోజా అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్.. ఎన్టీఆర్ మనువడు జూ. ఎన్టీఆర్‌ను పార్టీలోకి వస్తే అహ్వానిస్తామని అంటున్నాడని, ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందాఅంటూ రోజా ప్రశ్నించారు. దీనిని బట్టిచూస్తే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీని సక్సెస్ వైపుకు తీసుకెళ్లలేము, కనీసం జూ. ఎన్టీఆర్ అయినావస్తే మాకు నాలుగు ఓట్లు వస్తాయని ఒప్పుకోకనే ఒప్పుకున్నట్లు తెలిసిపోతుందని రోజా అన్నారు.

Minister Roja: ఇద్దరి ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా.. నారా లోకేష్‌కు రోజా సవాల్!

చంద్రబాబు నాయుడు, లోకేశ్‌కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు రాదని, ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఓట్లు రాబట్టుకొనేందుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందని రోజా విమర్శించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టొచ్చుఅని, ఎవరైనా పోటీచేసి ప్రజల మద్దతుతో గెలవచ్చుఅని అన్నారు. అయితే, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టో, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పి వారిని ఒప్పించగలిగితే ఎవరైనా విజయవంతం అవుతారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తారని, వంద కోట్ల ప్యాకేజీ అందిందని ప్రచారం జరుగుతుందని, ఇదంతా టీడీపీ గేమ్ ప్లాన్‌లో భాగమే అంటూ రోజా అన్నారు. తమతో పొత్తుపెట్టుకోకపోతే నిన్ను ప్యాకేజీ పవన్‌గా చిత్రీకరిస్తామంటూ పవన్‌ను బ్లాక్ మెయిల్ చేసేలా టీడీపీ గేమ్‌ప్లాన్ ఆడుతుందంటూ రోజా ఆరోపించారు.