నిమ్మగడ్డ..అసమర్ధ ఎన్నికల కమిషనర్

నిమ్మగడ్డ..అసమర్ధ ఎన్నికల కమిషనర్

MLA Roja angry with SEC Nimmagadda : పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ.. వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి టీడీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ..అసమర్ధ ఎన్నికల కమిషనర్ అని విమర్శించారు.

నిమ్మగడ్డ.. సమాధిలో నుంచి శవాన్ని తీసి బతికించాలని చాలా తాపత్రయం పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలన గానీ, కోవిడ్ టైమ్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని ప్రజలందరూ అనుకుంటున్న విషయాన్ని నిమ్మగడ్డ తెలుసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు.

నిన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్రీవాలను ఆపటం ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని అన్నారు. ప్రజల తీర్పును హాస్యాప్పదం చేయడం తగదని రోజా అన్నారు.

చిత్తూరు కలెక్టర్ ని తొలగించి ఎస్ఈసీ తన మనుషులను నియమించుకున్నారు. అయినా జిల్లాలో పంచాయతీ ఏకగ్రీవాలను నిలుపుదల చేయడం చాలా విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారని విమర్శించారు.