‘భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్..నిమ్మగడ్డ వ్యవహారం..కోర్టు తీర్పుపై నాగబాబు

  • Published By: nagamani ,Published On : May 29, 2020 / 08:04 AM IST
‘భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్..నిమ్మగడ్డ వ్యవహారం..కోర్టు తీర్పుపై నాగబాబు

ఏపీ‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందనీ.. హైకోర్టు ప్రజల్లో నమ్మకాన్ని నింపిందంటున్నారు.

ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలనీ..సూచిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన జనసేన నేత, మెడా బ్రదర్ నాగబాబు..ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్ చెప్పారు. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చిందని’ అని ట్వీట్ చేశారు.

నిమ్మగడ్డ వ్యవహారం ఇలా..
2016 జ‌న‌వ‌రి 30న.. ఎస్‌ఈసీగా న్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకం
2020, మార్చిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్
2020, ఏప్రిల్ 10న నిమ్మగడ్డను తొలగిస్తూ ఆర్డినెన్స్
ఏప్రిల్ 12న హైకోర్టుకు నిమ్మగడ్డ
2020 ఏప్రిల్ 18న ఏపీ సర్కారు కౌంటర్‌ పిటిషన్.. నేడు హైకోర్టు తీర్పు

ఇలా నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీలో మాటల యుద్దాలు నడిచాయి. ఈ క్రమంలో పలు పరిణామలు జరిగాయి. కానీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడిందనే విషయం మరోసారి నిరూపించబడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా దీనిపై ఏపీ సర్కారుకి ఝలక్ తగలటంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read: నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పుపై పవన్ కళ్యాణ్