Payyavula Keshav: త్వరలో నారా లోకేష్ పాదయాత్ర: పయ్యావుల కేశవ్

త్వరలో టీడీపీ నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.

Payyavula Keshav: త్వరలో నారా లోకేష్ పాదయాత్ర: పయ్యావుల కేశవ్

Updated On : September 18, 2022 / 2:43 PM IST

Payyavula Keshav: టీడీపీ నేత నారా లోకేష్ త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పయ్యావుల కేశవ్. లోకేష్ పాదయాత్ర ద్వారా పార్టీ కొత్త తరానికి చేరువ అవుతుందని పయ్యావుల అన్నారు.

Chandigarh University: అవన్నీ అబద్ధాలు.. విద్యార్థినుల ప్రైవేట్ వీడియో లీకులపై బాంబ్ పేల్చిన యూనివర్సిటీ

ఆదివారం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘త్వరలో నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు, ప్రజల గళాన్ని మరింత బలంగా వినిపించడమే లోకేష్ పాదయాత్ర లక్ష్యం. త్వరలోనే టీడీపీ అధినేత అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. దీనిలో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు క్లియరెన్స్ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో అధినేత చంద్రబాబు నిరంతరం చర్చిస్తున్నారు. అప్రతిష్టపాలైన ప్రభుత్వం, మరోపక్క అప్రతిష్ట పాలైన ఎమ్మెల్యేలతో సీట్ల విషయంపై జగన్ క్లారిటీకి రాలేకపోతున్నారు.

Chandigarh University: తోటి విద్యార్థినుల నగ్నవీడియోలు తీస్తూ ఆన్‭లైన్‭లో అప్‭లోడ్.. ఇప్పటికే 60కి పైగా.. అట్టుడికి పోతున్న యూనివర్సిటీ

రాబోయే ఎన్నికల్లో ముఖం చూపించలేక ప్రజలని ప్రభుత్వం రెచ్చగొడుతోంది. సుప్రీంకోర్టులో రైతులు చేసే న్యాయ పోరాటానికి వైసీపీ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలు సహకరిస్తాయి’’ అని పయ్యావుల కేశవ్ అన్నారు.