Teaching Hospitals : ప్రభుత్వ ఆసుపత్రులు మరింత బలోపేతం, రాష్ట్రంలో మరో 16 టీచింగ్ హాస్పిటల్స్.. సీఎం జగన్

పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. 4 బోధనాసుపత్రుల్లో(నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్) సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు.

Teaching Hospitals : ప్రభుత్వ ఆసుపత్రులు మరింత బలోపేతం, రాష్ట్రంలో మరో 16 టీచింగ్ హాస్పిటల్స్.. సీఎం జగన్

Teaching Hospitals

New 16 Teaching Hospitals In AP : పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. 4 బోధనాసుపత్రుల్లో(నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్) సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు.

రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎంఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయని జగన్ తెలిపారు. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్ధతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్‌ లేవని, నాలుగు చోట్ల అస్సలు ఎలాంటి పరికరాలు, సదుపాయాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో 16 కొత్త టీచింగ్‌ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాసుపత్రి, నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉండాలనే దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు.

ఈ పరికరాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలను నిర్వహిస్తామని సీఎం చెప్పారు. నిర్వహణ వ్యయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చూసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో, ఎప్పటికీ పనిచేసేలా ఈ పరికరాలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం జగన్

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను మరింత బలోపేతం చేస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వాసపత్రుల్లో అత్యాధునిక టెక్నాలజీతో సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు చేస్తున్న సేవలను సీఎం అభినందించారు.

శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో కొత్తగా సీటీ, ఎంఆర్‌ఐ ప్రరికరాలు :
ఈ పరికరాలకు మూడేళ్లు వారంటీ ఉంటుందని, మరో ఏడేళ్లపాటు నిర్వహణను కంపెనీలు నిర్వహిస్తాయని సీఎం జగన్‌ అన్నారు. మిగిలిన 7 బోధనాసుపత్రుల్లో ఉన్న పరికరాల అప్‌డేషన్‌, కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా వీటిని నిర్వహిస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బంది వీళ్లే కాకుండా గ్రామస్థాయి వరకూ ఉన్న ఆశావర్కర్లు, వాలంటీర్లు, వీరందరూ కూడా కోవిడ్‌ సమయంలో పగలు, రాత్రి అనక కష్టపడుతున్నారని, ఎంతో ఒత్తిడి ఉన్నా… ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని జగన్ ప్రశంసించారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువేనన్నారు.

కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఎం అండ్‌ హెచ్‌ఓలకు సీఎం జగన్ సూచనలు:
ఫీవర్‌ సర్వే సరిగ్గా చేయలేదని కొందరు అధికారులు కింద స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటన్నారన్న వార్తలు చూశానని సీఎం జగన్‌ అన్నారు. ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిలో ఉన్నారని గుర్తించాలన్నారు. మంచిగా వారితో పనిచేయించుకోవాలని అధికారులను కోరారు. మన దగ్గర హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలు లేకపోయినా.. మన రాష్ట్రంలో మరణాల రేటు దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ అన్నారు. ఉద్యోగులంతా బాధ్యతలను చిరునవ్వుతో తీసుకుంటున్నారు, ఎంత ఒత్తిడి ఉన్నా పని చేస్తున్నారు. కాబట్టే ఇది సాధ్యం అయిందని సీఎం జగన్ అన్నారు. ఎవరూ సహనం కోల్పోవద్దని, దయచేసి అందరూ మంచితనంతో పని చేయించుకోవాలని సీఎం జగన్ కోరారు.