I-PAC Team Survey Report : వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ.. సీఎం జగన్‌కు అందిన ఐప్యాక్ టీమ్ నివేదిక

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైన ఐప్యాక్ టీమ్.. సర్వేల నివేదికలను అందించింది.

I-PAC Team Survey Report : వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ.. సీఎం జగన్‌కు అందిన ఐప్యాక్ టీమ్ నివేదిక

I-PAC Team Survey Report : ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైన ఐప్యాక్ టీమ్.. సర్వేల నివేదికలను అందించింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రోజువారీ సర్వే చేస్తోంది ఐప్యాక్ టీమ్.

ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు పాల్గొన్నారు? ప్రభుత్వ పథకాలను ఎలా అందించారు? అనేది నివేదికల్లో పొందుపరుస్తోంది. దీనిపై గతంలోనే ఓసారి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. వచ్చే ఎన్నికలకు కొంతమంది సిట్టింగ్ లను మారుస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో సీఎం చేతికి నివేదిక అందింది. దీంతో తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంటుందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. తమ పనితీరుకు ఎన్ని మార్కులు పడ్డాయోనని వర్రీ అవుతున్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ప్రధానంగా దీనిపైనే ఐప్యాక్ టీమ్ తో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రోజువారీ సర్వే చేసింది ఐప్యాక్ టీమ్. ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నారు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, తలెత్తిన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఐప్యాక్ టీమ్ సర్వే నిర్వహించింది. దానికి సంబంధించిన నివేదికలను సీఎం జగన్ చేతికి అందించింది ఐప్యాక్ టీమ్.

ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు? వారి పనితీరు ఎలా ఉంది? అనే దానిపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. టాప్ టెన్ లో ఎంతమంది ఉన్నారు? ఎక్కువ రోజులు గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించిన ఎమ్మెల్యే ఎవరు? చాలా తక్కువ రోజులు ఈ కార్యక్రమం నిర్వహించిన వారు ఎవరు? అనే దానిపై పూర్తి స్థాయి నివేదిక ఐప్యాక్ టీమ్ సీఎం జగన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిపై రోజువారీ సర్వేలు చేయించారు. ప్రత్యేకంగా ఐప్యాక్ టీమ్.. నియోజకవర్గాల వారీగా సీక్రెట్ గా దీనికి సంబంధించిన సర్వే చేస్తోంది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. అందులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనే ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్టును జగన్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై ఏ విధంగా రెస్పాండ్ అవుతారనే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలలో టెన్షన్ కనిపిస్తోంది. ఐప్యాక్ టీమ్ తమ పనితీరుకి సంబంధించి ఎలాంటి నివేదిక ఇచ్చిందో అని టెన్షన్ పడుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అదనపు సమన్వయకర్తలను నియమిస్తున్నారు జగన్. దీంతో ఎవరెవరికి సీట్లు తొలగుతాయో అని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ ఇప్పటికే పలుసార్లు తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో ఇప్పడు ఐప్యాక్ టీమ్ ఇచ్చిన నివేదికతో.. ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించి మూడు నెలలు అయ్యింది. ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక కూడా వచ్చేసింది. దీంతో త్వరలో జరిగే సమీక్షలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.