Next CM Jr Ntr : నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు పర్యటనలో ఫ్లెక్సీలు, నినాదాలు

తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. మరోసారి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అనే ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి.

Next CM Jr Ntr : నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు పర్యటనలో ఫ్లెక్సీలు, నినాదాలు

Next Cm Jr Ntr

Next CM Jr Ntr : తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. మరోసారి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అనే ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.

ఈ సమయంలో కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హల్ చల్ చేశారు. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వారు నినాదాలు కూడా చేశారు. ఇవన్నీ గమనిస్తూనే చంద్రబాబు తన పర్యటన కొనసాగించారు. గతంలో చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు కూడా ఇదే తరహా సీన్ కనిపించింది. దీంతో మరోసారి యంగ్ టైగర్ ప్రస్తావన తెరపైకి వచ్చినట్టు అయ్యింది.

చంద్రబాబు పర్యటనలో పార్టీ జెండాలపై ఎన్టీఆర్ బొమ్మలతో కొందరు వ్యక్తులు కనిపించారు. ఆ బ్యానర్లపై నెక్ట్స్ సీఎం అని రాసి ఉంది. అంతేకాదు చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే నెక్ట్స్ ఏపీ సీఎం జూ.ఎన్టీఆర్ అని కొందరు గట్టిగా నినాదాలు సైతం చేశారు. ఎన్టీఆర్ బ్యానర్లను ఊపుతూ, నినాదాలు చేశారు. అయితే చంద్రబాబు అవేమీ పట్టించుకోనట్టు వ్యవహరించారు. తన స్పీచ్ ని కొనసాగించారు.

సినిమాల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ తారక్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ పగ్గాలు తీసుకోవాలని ఆయన అభిమానులు గట్టిగా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. టీడీపీలోకి ఎన్టీఆర్ ని తేవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అస్సలు స్పందించడం లేదు.