Perni Nani: పవన్ కల్యాణ్ వారాంతపు నాయకుడు.. చిరంజీవి దయతోనే పవన్ ఎదిగారు: పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ వారాంతపు నాయకుడని పేర్ని నాని విమర్శించారు. పవన్ చిరంజీవి దయతోనే ఎదిగారని, ఇప్పుడు ఆయననే తప్పుబడుతున్నారని నాని అన్నారు.

Perni Nani: పవన్ కల్యాణ్ వారాంతపు నాయకుడు.. చిరంజీవి దయతోనే పవన్ ఎదిగారు: పేర్ని నాని

Perni Nani

Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాంతపు నాయకుడని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని. ఆదివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.

Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

‘‘పవన్ కల్యాణ్ వారాంతపు నాయకుడు. ఆయన భ్రమల్లో ఉన్నారు. చిరంజీవి దయతో పవన్ ఎదిగారు. ఇప్పుడు చిరంజీవినే తప్పుబడుతున్నారు. చిరంజీవి రాజకీయ తప్పులు చేసినట్లు పవన్ మాట్లాడతారా? చిరంజీవి నిఖార్సుగా ఉన్నారు. పార్టీ పెట్టి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టారు. చిరంజీవి 18 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్నాడు. చిరంజీవి పార్టీ పెట్టి పోరాడి గెలిచారు. సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్. రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదు. జనసేన వల్ల చంద్రబాబు, లోకేష్ లాభపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 సీట్లే వస్తాయని పవన్ అంటున్నారు.

Nirmala Sitharaman: స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వండి.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ సూచన

జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో మాత్రం చెప్పడం లేదు. పవన్‌తోసహా ఎక్స్‌పైరీ డేట్ అందరికీ ఉంటుంది. దసరాకు వచ్చి మా పని తేలుస్తానని అన్నారు. ఇప్పుడు పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. పవన్ పాదయాత్రకు చంద్రబాబు అనుమతి ఇవ్వలేదా? అమరావతిలో అభివృద్ధిపై నేను చర్చకు సిద్ధం.. పవన్ సిద్ధమా? మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.