ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం, యువతి నుంచి భారీగా డబ్బు దండుకున్నాడు

అతడు ఓ పోలీస్ కానిస్టేబుల్. బాధ్యతాయుతమైన పదవి. ఆపదలో ఉన్నావారిని ఆదుకోవాలి. మోసపోయిన వారికి న్యాయం చేయాలి.

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 05:27 AM IST
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం, యువతి నుంచి భారీగా డబ్బు దండుకున్నాడు

అతడు ఓ పోలీస్ కానిస్టేబుల్. బాధ్యతాయుతమైన పదవి. ఆపదలో ఉన్నావారిని ఆదుకోవాలి. మోసపోయిన వారికి న్యాయం చేయాలి.

అతడు ఓ పోలీస్ కానిస్టేబుల్. బాధ్యతాయుతమైన పదవి. ఆపదలో ఉన్నావారిని ఆదుకోవాలి. మోసపోయిన వారికి న్యాయం చేయాలి. అలాంటి డ్యూటీలో ఉంటూ అతడే దారి తప్పాడు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ గురించి ఆరా తీస్తే అప్పటికే అతడికి పెళ్లి అయ్యిందని యువతికి తెలిసింది. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని, మోసం చేసిన కానిస్టేబుల్ కు శిక్ష పడాలని ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read: మహిళను వేధించిన ఎస్సైపై వేటు.. విచారించాలంటూ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు