MLC elections : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు  వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.

MLC elections : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

Mlc Election

Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో..ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయా ? లేదా అనే సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్, ఏపీలో మధ్యాహ్న కర్ఫ్యూ, కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.

ఈ సందర్భంలో సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు  వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది. ఏపీలో 03, తెలంగాణలో 06 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణలో జూన్ 03వ తేదీతో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. అలాగే ఏపీ రాష్ట్రంలో మే 31వ తేదీతో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

ఎన్నికలు నిర్వహిస్తే..ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని సీఈసీ భావించింది. అంతేగాకుండా..ఇటీవలే జరిగిన ఎన్నికల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు నిర్వహణ బాగుండదని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీ నిర్ణయించింది.ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు  వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.

Read More :  రూ.5లకే అన్నం : ఒక్క‌రోజే 45 వేల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటీన్లు