Prakasam District: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

Road Accident,
Road Accident: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Road accident: ఒకదానివెనుక ఒకటి ఢీకొన్న ఐదు వాహనాలు.. నిట్టనిలువునా ఆయిల్ ట్యాంకర్‌కు చీలికలు
త్రిపురాంతకం సమీపంలోని అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జివద్ధ ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ సర్వీస్‌రోడ్డు మీదుగా కారు ప్లైఓవర్ ఎక్కుతున్న క్రమంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసుకోకపోవడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రమాదం సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వారు అనంతపురంలో ఒక మ్యారేజ్ డెకరేషన్ నిమిత్తం వెళ్లి పనిపూర్తి చేసుకొని తిరిగి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Kishtwar Road accident: జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లోని డ్యామ్ వద్ద ప్రమాదం.. ఏడుగురు మృతి
బస్సు, కారు ఢీకొనడంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం బస్సులోని ప్రయాణికులను మరో బస్సు ద్వారా హిందుపురంకు పంపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.