Bopparaju : పీఆర్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా? బొప్పరాజు

తాము సమ్మెకి వెళ్తే జీతాల డబ్బులన్నీ మిగుల్చుకోవచ్చనేది ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. మొన్న చర్చలకు వెళ్తే అరగంటలో మాట్లాడుకుని చెబుతామని సెక్రటేరియేట్ నుంచి వెళ్లిపోయారన్నారు.

Bopparaju : పీఆర్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా? బొప్పరాజు

Bopparaju (1)

Bopparaju challenged ap government : ఏపీ ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పీఆర్సీ వివాదం కొనసాగుతోంది. పీఆర్సీ విషయంలో తమతో బహిరంగ చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా అని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు సవాల్ చేశారు. చర్చల్లో ఏం చెప్పడం లేదు.. ఛాయ్-బిస్కెట్టులు ఇచ్చి పంపుతున్నారని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి కదా..? బహిరంగ చర్చకు సిద్ధమా..? ఛాలెంజ్ చేశారు.

పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సీఎస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై కమిటీ సభ్యులు భేటీలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపైనా స్టీరింగ్ కమిటీ చర్చించింది. ఇదిలావుంటే చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు సజ్జల, సీఎస్ ఆఫర్ ఇచ్చారు. సమావేశం అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు.

Suryanarayana : పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందే : సూర్యనారాయణ

తాము సమ్మెకి వెళ్తే జీతాల డబ్బులన్నీ మిగుల్చుకోవచ్చనేది ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. మొన్న చర్చలకు వెళ్తే అరగంటలో మాట్లాడుకుని చెబుతామని.. సెక్రటేరియేట్ నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. సజ్జలకు ఫోన్ చేస్తే మేం ఎప్పుడో వెళ్లిపోయామని చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండుతో చర్చలకు రావాలన్నారు. ‘అధికారులకు ఏం తెలుసు.. మీ జీతాలు మేము వేస్తుంటే మీరేంటీ మాకు చెప్పేది’ అని అన్నారు.

పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వాలని తాము కోరితే.. ఇస్తామని చెప్పిన మంత్రుల కమిటీ.. ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. తమ ఆవేదనను వివిపిస్తే తాము బలప్రదర్శన చేసినట్టా..? అని అడిగారు. మీ గడపల చుట్టూ తిరిగితే లొంగి ఉన్నట్టు.. ప్రశ్నిస్తే బల ప్రదర్శన చేసినట్టా..? అని పేర్కొన్నారు.

TSRTC : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నేరుగా వనదేవతల గద్దెల దగ్గరే దిగొచ్చు

సీఎంఓ అధికారులు.. కొందరు ఐఏఎస్ లే తమను సమ్మెకు పురికొల్పారని తెలిపారు. సమస్యను జఠిలం చేస్తే తమకొచ్చే లాభమేంటో చెప్పాలన్నారు. సమ్మె చేస్తే తమకు నష్టమని, తమ జీతాలు కోత పడతాయి.. అయినా చివరి అస్త్రంగా సమ్మెకి వెళ్తున్నామని స్పష్టం చేశారు.