Rajya Sabha Elections : ఏపీ నుంచి అదానీ భార్య, సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాదికి రాజ్యసభ చాన్స్?
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భార్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిస్తున్నాయి. అలాగే సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

Ap Rajyasabha
Rajya Sabha Elections : ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. రాజ్యసభ బరిలో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలో రాజసభ్య సభ్యులు విజయసాయిరెడ్డి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరిల పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ నాలుగు కూడా వైసీపీకే దక్కడం ఖాయం కనిపిస్తోంది.
కాగా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భార్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిస్తున్నాయి. అలాగే సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. నాలుగో స్థానాన్ని మైనార్టీ లేదా దళిత వర్గానికి ఇవ్వాలని జగన్ యోచించినట్లు తెలుస్తోంది.
Rajya Sabha : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్
మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, మైనార్టీ నుంచి సినీ నటుడు అలీ, ఇక్బాల్ పేర్లు వినపడుతున్నాయి.
రాజ్యసభలో త్వరలో 57 స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఆయా రాజ్యసభ సీట్ల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాలకు చెందిన ఈ సీట్లకు జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 24న విడుదల చేయనుంది.
CM KCR Prakash Raj : తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్‌కు రాజ్యసభ చాన్స్..?
ఇక ఖాళీల వివరాల్లోకెళితే… ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సహా.. బీజేపీ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్‌ల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకే ఎన్నికలు జరగనున్నాయి.