Rayapati Sambasiva Rao : వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకమవుతాయి- మాజీ ఎంపీ హాట్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకం అవుతాయని ఆయన అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపైనా ఆయన స్పందించారు. కన్నా రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేశారని చెప్పారు. పెదకూరపాడులో కన్నా నేను కలిసి పోటీ చేశామన్నారు. చేబ్రోలు హనుమయ్య.. కన్నాను ప్రోత్సాహించాడని చెప్పారు.

Rayapati Sambasiva Rao : వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకమవుతాయి- మాజీ ఎంపీ హాట్ కామెంట్స్

Rayapati Sambasiva Rao : ఎన్నికలు, పొత్తుల అంశాలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు పొత్తుల గురించి హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే, పలువురు సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నికల పొత్తుల గురించి తమదైన విశ్లేషణ ఇస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు.

Also Read..Maha Sena Rajesh: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మహాసేన రాజేష్

తాజాగా సీనియర్ నేత, మాపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకం అవుతాయని ఆయన అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపైనా ఆయన స్పందించారు. కన్నా రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేశారని చెప్పారు. పెదకూరపాడులో కన్నా నేను కలిసి పోటీ చేశామన్నారు. చేబ్రోలు హనుమయ్య.. కన్నాను ప్రోత్సాహించాడని చెప్పారు.

Also Read..Janasena Pawan kalyan : కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించిన జనసేన

ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి సిటు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తానన్నారు రాయపాటి సాంబశివరావు. కన్నా టీడీపీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రాయపాటి సాంబశివరావు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నాతో కలిసి పని చేస్తామన్నారు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది, నాకు ఉండేది నాకు ఉంటుందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గత ఎన్నికల్లో పత్తిపాటి, జి.వి.ఆంజనేయులు, యరపతినేని లాంటి వారికి ఆర్దిక సాయం చేశానన్నారు. ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని రాయపాటి వాపోయారు. నరసరావుపేట సీటు చదలవాడ అరవింద్ బాబు దే అని చెప్పారు. ఈసారి అరవింద్ బాబు తప్పకుండా నరసరావుపేట ఎమ్మెల్యే అవుతాడని రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు.