Visakha : గర్భిణిని 3 కిలోమీటర్లు చేతులపై మోసుకెళ్లినా దక్కని ఫలితం..

ప్రసవం నొప్పులతో వేదన పడుతున్న గర్భిణిని మూడు కిలోమీటర్ల దూరం చేతులమీదనే మోసుకెళ్లారు బంధువులు. అయినా బిడ్డను దక్కించుకోలేకపోయారు. సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ రాని పరిస్థితి. దీనికి తోడు వర్షాలు భారీగా కురుస్తుండటంతో విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవం కష్టాలు తప్పటంలేదు. ఈ క్రమంలో మరో తల్లికి కడుపుశోకమే మిగిలింది.

Visakha : గర్భిణిని 3 కిలోమీటర్లు చేతులపై మోసుకెళ్లినా దక్కని ఫలితం..

Pregnant Women

pregnant on their hands for three kilometers : ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గర్బిణిలకు పురిటి కష్టాలు తప్పటంలేదు. మహిళల కోసం ఎన్నో చేస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్నా..బిడ్డను కనాలంటే గర్భిణి ప్రసవం నొప్పులతో పాటు తన బిడ్డ ఈ భూమ్మీదకు సురక్షితంగా వస్తుందా? లేదా తొమ్మిది నెలలు మోసాక ప్రసవించలేక బిడ్డను పోగొట్టుకుంటానా?అనే ఆందోళన గర్భిణుల్లో ఉంది. కారణం..బిడ్డను ప్రసవించటానకి ఆసుపత్రికి వెళ్లాంటే వారికి కాలినడకే ఆధారం. సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ లు కూడా రాని పరిస్థితి. రాలేని దుస్థితి. దీంతో గర్భిణులకు ప్రసవం నొప్పులు వస్తే చాలు గర్భిణితో పాటు వారి బంధువులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఈ అభివృద్ధి చెందుతుందని చెప్పుకునే కాలంలో కూడా కొనసాగుతుండటం దురదృష్టకరం.. ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితులు మరీ దర్భరంగా ఉన్నాయి.

ప్రసవం నొప్పులతో వేదన పడుతున్న గర్భిణిని చేతులమీదనే మోసుకెళ్లారు బంధువులు. అలా మూడు కిలోమీటర్ల దూరం చేతులమీదనే మోసుకెళ్లారు. కారణం సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ రాని పరిస్థితి. దీనికి తోడు వర్షాలు భారీగా కురుస్తుండటంతో విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవం కష్టాలు తప్పటంలేదు. ఈక్రమంలో మరో గర్భిణి అదే కష్టంతో బిడ్డను కనటానికి ప్రసవం నొప్పులకంటే దారుణం బాధను అనుభవించింది విశాఖలోనే ఏజెన్సీ ప్రాంతం అయిన ముంచింగిపుట్టు గ్రామానికి చెందిన చెల్లమ్మ అనే గర్భిణి.

గత మూడు రోజులుగా పురిటి నొప్పులతో నరకయాతన అనుభవించింది. సరైన రోడ్లు లేక..అంబులెన్స్ వచ్చే దాని లేక..గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే ప్రసవం చేద్దామనుకున్నారు బంధువులు. కానీ ఎంతకూ కాన్పు జరగకపోవటంతో వాహనంలో తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవటంతో బంధువులు కొంచెం దూరంగా గర్భిణిని నడిపించుకెళ్లారు. కానీ ఓ పక్క ప్రసవం నొప్పులు మెలిపెట్టేస్తుంటే నడవలేక నడిరోడ్డు మీద బురదలోనే ఆమె కూర్చుండిపోయింది.దీంతో ఆమెను బంధువులు మూడు కిలోమీటర్ల దూరం చేతులమీద మోసుకెళ్లారు. అలా నానా కష్టాలు పడి ఆసుపత్రికి చేర్చగా అప్పటికే గర్భిణి కడుపులో బిడ్డతో పాటు ఆమె పరిస్థితి విషమంగా మారింది.

ఈ క్రమంలో ఈ లోకాన్ని చూడకుండానే తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయింది.దీంతో తల్లి చెల్లమ్మతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తన మొదటిబిడ్డను కళ్లతో చూడకుండానే కోల్పోయానని గర్భిణి చెల్లమ్మ విలపించింది.కాగా…విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఇప్పటికీ దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో గర్భిణిలకు కడుపుకోతలు తప్పటంలేదు.కారణం ఆసుపత్రికి చేరాలంటే కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలం రోడ్డు మరీ దారుణంగా తయారు అవ్వటంతో గర్బిణి తమ బిడ్డల్ని కోల్పోయి కడుపుకోతలను అభవిస్తున్నారు.