రాంకీ సాల్వెంట్ ఫార్మాలో ప్రమాదం..శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలని బంధువుల ఆందోళన

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 07:04 AM IST
రాంకీ సాల్వెంట్ ఫార్మాలో ప్రమాదం..శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలని బంధువుల ఆందోళన

మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదపు 12 ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.

రాత్రి 2.30 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, ఇందులో ఒకరికి మాత్రమే తీవ్రగాయాలయ్యయని..వీరిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ శ్రీనివాస్ కనిపించడం లేదంటూ…కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

కంపెనీలోకి వెళ్లే సమయంలో సెక్యూర్టీ విభాగం వద్ద ఉద్యోగుల సెల్ ఫోన్ తీసుకుంటరని, అలాగే శ్రీనివాస్ వద్ద సెల్ ఫోన్ తీసుకున్నారని కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు. అతను క్షేమంగా ఉంటే..సీసీ టీవీ ఫుటేజ్ లు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు.

లోపలకు వెళ్లినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కంపెనీ సిబ్బందికి సమాచారం ఉంటుందంటున్నరు. గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభార్జానే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ప్రమాదం జరిగిన తర్వాత..ప్రభుత్వం చూసుకుంటుందనే ఆలోచనలో వారు ఉన్నారని వెల్లడిస్తున్నారు.

ప్రజలు, కార్మికులు అనుక్షణం భయం భయంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించడంతో పాటు, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు.