Andhra Pradesh : ఏపీలో కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు..ఆ ఒక్క జిల్లా మినహా

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నిబంధనలు, ఆంక్షలకు సడలింపులు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Andhra Pradesh : ఏపీలో కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు..ఆ ఒక్క జిల్లా మినహా

Ap

Andhra Pradesh New Curfew Regulations: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నిబంధనలు, ఆంక్షలకు సడలింపులు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా..ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వనుంది. జూన్ 20వ తేదీ తర్వాత..ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి.

కరోనా కట్టడి కోసం..ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మే 05వ తేదీ నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 02 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 06గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగిస్తే..వైరస్ మరింత కంట్రోల్ లోకి వస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోందని సమాచారం. అయితే..సమయంలో సడలింపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ 2021, జూన్ 20వ తేదీతో ముగియబోతున్న సంగతి తెలిసిందే. దీంతో కర్ఫ్యూ ఆంక్షలను మరిన్ని రోజులు పొడిగిస్తారా ? అనే చర్చ కొనసాగింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఉదయం 06 గంటల నుంచి సాయంత్రం 06 గంటల వరకు సడలింపులు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. జూన్ 20వ తేదీ నుంచి జూన్ 30 వరకు అమల్లో కొనసాగనుందని, సాయత్రం 05 గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 06 గంటల నుంచి మధ్యాహ్నం 02 గంటల వరకు సడలింపు ఉండనుందని, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యదాతథంగా పనిచేయనున్నాయని తెలిపింది.