ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్

  • Published By: bheemraj ,Published On : November 3, 2020 / 10:42 PM IST
ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్

AP Intermediate Board : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ కేలండర్ విడుదలైంది. ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారంలో నిర్వహించనున్నారు.



ఈ మేరకు మంగళవారం (నవంవర్ 3, 2020) ఇంటర్ విద్యామండలి అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి.



జూన్ చివరి వారంలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి 2021-2022 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.



రెండో శనివారం సైతం తరగతులు నిర్వహించనున్నారు. టర్మ్ సెలవులు ఉండవు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 127 రోజులు కాలేజీలు పని చేయనున్నాయి.