15లోగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితా

15లోగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితా

అక్టోబర్ 15వ తేదీలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను ప్రచురిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అర్హులు ఎవరికైనా సాయం అందకపోతే అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. పరిశీలన తర్వాత వీరికి మలివిడదతలో సాయం అందిస్తామని ప్రకటించారు. 

సచివాలయంలో మంత్రికన్నబాబు సోవారం మీడియాతాో మాట్లాడారు. ‘ఇప్పటి వరకూ 79.44లక్షల రైతు ఖాతాలు పథకానికి అర్హమైనవిగా గుర్తించాం. కౌలు రైతులకూ పథక సాయాన్ని అందిస్తాం. 15.52 లక్షల మంది కౌలు రైతులున్నట్లు గుర్తించాం. ఆర్ఓఆర్ పట్టాలున్న గిరిజనలకు పథకాన్ని వర్తింపజేస్తాం. అన్నదాత సుఖీభవ పథకం చాలా మంది అనర్హులకు చేరింది’

‘చనిపోయిన రైతుల వారుసులకూ పథక సాయాన్ని అందిస్తాం. 1.07లక్షల మంది రైతులు చనిపోయినట్లు గుర్తించాం. వీరి వారసుల గుర్తింపు బాధ్యతను సంయుక్త కలెక్టర్లకు అప్పగించాం. ఆధాయపన్న చెల్లించే 1.50లక్షల మంది, ప్రభుత్వ ఉద్యోగులు 21వేల మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాం’ అని మంత్రి వెల్లడించారు.