CS Sameer Sharma : పీఆర్సీతో జీతాలు తగ్గవు, సౌతిండియాలోనే ఏపీలో హెచ్ఆర్ఏ ఎక్కువ | Salaries Will Not Be Reduced AP CS Sameer Sharma Reaction On PRC Issue

CS Sameer Sharma : పీఆర్సీతో జీతాలు తగ్గవు, సౌతిండియాలోనే ఏపీలో హెచ్ఆర్ఏ ఎక్కువ

కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెఆర్ఏ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశాము.

CS Sameer Sharma : పీఆర్సీతో జీతాలు తగ్గవు, సౌతిండియాలోనే ఏపీలో హెచ్ఆర్ఏ ఎక్కువ

CS Sameer Sharma : పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే యోచన లేదంటోంది ఏపీ ప్రభుత్వం. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఏపీలోనే ఉద్యోగుల బడ్జెట్ ఎక్కువగా ఉందన్నారు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉందన్నారు. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశామని చెప్పారాయన. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎస్. ఐఆర్ తో ప్రభుత్వంపై రూ.17వేల కోట్ల భారం పడిందన్నారు.

కొత్త వేతన సవరణపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పందించారు. ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ ప్రభుత్వం తగ్గించ లేదని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల నుండి పీఆర్సీ గురించి అవగాహన ఉందన్నారు. అప్పటి పరిస్థితి వేరు.. ప్రస్తుత పరిస్థితులు వేరని వివరించారు. కరోనా, ఒమిక్రాన్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలు, ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

AP PRC : పీఆర్సీ రగడ.. సమ్మెలోకి ఉద్యోగులు?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని అంశాలపై చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు. పీర్సీసీపై ఉద్యోగ సంఘాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. గతంలో రాష్ట్ర ఆదాయం రూ.98 వేల కోట్లుగా ఉండేదని, కరోనా కారణంగా అది రూ.62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా థర్డ్ వేవ్ వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఐఆర్.. జీతంలో భాగం కాదన్నారు. పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీలో ఏ మాత్రం తగ్గదని సీఎస్ స్పష్టం చేశారు. హెచ్ఆర్ తగ్గిందా? పెరిగిందా? అనేది వేరే అంశమన్నారు. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఐఎఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమన్న సీఎస్.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో అవుతున్నామన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మూడు పీఆర్సీ జీవోలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఏపీలో పీఆర్సీ రగడ తారస్థాయికి చేరింది. ఏపీ ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. కొత్త పీఆర్సీ వద్దే వద్దంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని.. కార్యచరణ ప్రకటిస్తామని కుండబద్ధలు కొట్టారు.

ఈ నెల 21న ఏపీ జేఏసీ తరపున సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని, తమకు కొత్త పీఆర్సీ వద్దని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని, మూడు జీవోలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీతో ప్రతి ఉద్యోగికి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని వాపోయారు.

Alcohol : మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా? ఇందులో నిజమెంత?

మా డీఏలు మాకిచ్చి జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమే అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. రూ.10 వేల కోట్ల అదనపు భారం పడుతుందని సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్ అన్నారు. కేంద్ర పే స్కేలును అమలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. తమ అంగీకారం లేకుండా ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంటుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ”డీఏలను కలుపుకుని జీతం లెక్క పెట్టడం కరెక్ట్ కాదు. ఇంటి అద్దెలు పెరుగుతుంటే ప్రభుత్వం హెచ్ఆర్ఏ తగ్గించటం ఏంటి? మేము రోడ్ల మీద గుడిసెలు వేసుకుని ఉండాలని ప్రభుత్వం భావిస్తోందా? చర్చల సమయంలో హెచ్ఆర్ఏ తగ్గిస్తాం, సీసీఏ రద్దు చేస్తాం అనే విషయాలు చెప్పలేదు” అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

×