సంక్రాంతి జోష్  : పల్లెకు పోదాం..పండగ చేద్దాం చలో చలో..

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 05:16 AM IST
సంక్రాంతి జోష్  : పల్లెకు పోదాం..పండగ చేద్దాం చలో చలో..

హైదరాబాద్ : మనిషి మూలను గుర్తు చేసే సంక్రాంతి పండుగ. మనిషి ఎంత ఎదిగినా..ఎంత పెద్ద మహానగరంలో వుంటున్నా..పండుగ వచ్చిందంటే పల్లెలకే పరుగు తీయించే పండుగల సంక్రాంతి. తన మూలాలను వెతుక్కుంటు గంపెడు గుర్తులను గుండెల్లో దాచుకునేందుకు సంక్రాంతి పండుగను మనసారా ఆస్వాదించేందు పల్లెలకు పరుగులు తీస్తున్నాడు. ని తిరిగి నగరానికి వస్తున్నాడు. ముఖ్యంగా తెలుగువారికి పెద్ద పండుగు..సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పండుగు..రైతన్న కష్టించిన పండించిన పంట శిరి ఇంటికొచ్చే పండుగ..మూడు రోజుల ముచ్చటైన పండుగల సంక్రాంతి..పల్లెకు పోయేందుకు..పుట్టిన పెరిగిన ఊరును కళ్లారా చూసుకునేందుకు..బంధుమిత్రులతో జాలీగా గడిపేందుకు అమ్మ చేతి కమ్మని వంటను  మళ్లీ మళ్లీ రుచి చూసేందుకు మనిషి పరుగు ఆగటంలేదు..సంక్రాంతి వచ్చిందంటే ఊరు వెళ్లేందుకు మనసు ఆగదు..కాళ్లు ఆగవు..ఊరువైపు మనసు పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో సంక్రాంతికి హైదరాబాద్ నగరం నుంచి గ్రామాలకు ప్రయాణం మొదలైంది.

విద్యార్థులకు సెలవులు ప్రారంభం కావడంతో వారిని తీసుకుని అందరూ ఊరు బాట పట్టారు.రెండు రోజుల క్రితం నుంచే ప్రయాణాలు ప్రారంభంకాగా, జనవరి 7న  సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. జనరల్ బోగీల్లోకి ఎక్కేందుకు ఫీట్స్ కూడా చేసేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చిన వారు కిక్కిరిసిన బోగీల్లోకి ఎక్కలేక..ఎక్కకుండా వుండలేక అల్లాడిపోయారు. 

మరోవైపు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లలోనూ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ చెప్పినా అది ప్రయాణీకులు రద్దీ రీత్యా ఏమాత్రం సరిపోవటంలేదు. జనవరి 10వ తేదీ నుంచి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని బస్సుల్లోనూ సీట్లు ఫుల్ అయిపోయాయ్. మరోపక్క రిజర్వేషన్ వున్న స్పెషల్ బసెస్ పరిస్థితి కూడా ఇలాగే వుంది. దీంతో పల్లెకు పోదామనే తపనతో రాత్రంతా నిలబడి ప్రయాణించేందుకు కూడా వెనుకాడకుండా ఎలాగోలా ఏదోక ట్రాన్స్ పోర్టేషన్ తో ఊర్లకు వెళ్లిపోతున్నారు నగర ప్రజలు.