TTD Wedding Gift : పెళ్లి చేసుకునేవారికి శుభవార్త… తిరుమల శ్రీవారి నుంచి వివాహ కానుక

నూతన వధూవరులకు టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. మరి శ్రీవారికి వెడ్డింగ్ కార్డ్ ఎలా పంపాలి? అడ్రస్ ఏంటి? శ్రీవారి పెళ్లి కానుకలో ఏమేం ఉంటాయి? 

TTD Wedding Gift : పెళ్లి చేసుకునేవారికి శుభవార్త… తిరుమల శ్రీవారి నుంచి వివాహ కానుక

Ttd Wedding Gift

TTD Wedding Gift : పెళ్లి వేడుక సమయంలో దేవుళ్లను పూజించడం తెలుగువారి సంప్రదాయం. ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యం జరిగిపోవాలని వినాయకుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. అలాగే శుభలేఖ దగ్గర్నుంచి.. ప్రతి వస్తువును ముందుగా దేవుడి ముందు పెడతారు. ఆ తర్వాతే బంధువులకు, స్నేహితులకు ఇస్తారు.

చాలామంది తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గరలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు లేవు. మరి దూరంగా ఉన్నవారి పరిస్థితి ఏంటీ? శుభలేఖను ఎలా పంపాలి? ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది.

నూతన వధూవరులకు టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. మరి శ్రీవారికి వెడ్డింగ్ కార్డ్ ఎలా పంపాలి? దానికి ప్రాసెస్ ఏంటి? అడ్రస్ ఏంటి? శ్రీవారి పెళ్లి కానుకలో ఏమేం ఉంటాయి?

ఇంట్లో పెళ్లి నిశ్చయం కాగానే మొదటి శుభలేఖను నెల ముందుగానే తిరుమలకు పంపొచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు.

తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం ‘శ్రీ లార్డ్‌ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్‌ చేయొచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. టీటీడీ కల్పించిన ఈ అవకాశం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని గతంలోనూ టీటీడీ అందించింది.