Special Study Offers : 10th స్టూడెంట్స్ కోసం దిల్ కుష్, సమోసా, జిలేబీ

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 02:39 AM IST
Special Study Offers : 10th స్టూడెంట్స్ కోసం దిల్ కుష్, సమోసా, జిలేబీ

సంక్షేమ హాస్టళ్లలో టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత సంవత్సరం నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి మరింత శ్రద్ధతో వీటిని నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలకు ఉపక్రమిస్తోంది. పండుగ సెలవులు పూర్తయిన అనంతరం వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమ శాఖలు ప్రారంభించనున్నాయి. స్కూల్ నుంచి హాస్టల్‌కు వచ్చిన అనంతరం రివిజన్ తరగతులు నిర్వహించాలని సంక్షేమ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

అయితే..రాత్రి భోజనం తర్వాత..అంటే..8 గంటల తర్వాత నిర్వహించే ఈ స్టడీ అవర్స్ రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి 45 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున 4 సబ్జెక్టులపై స్టడీ జరుగనుంది. ఇందులో వచ్చే సందేహాలను తీర్చడానికి స్థానికంగా ఉన్న యువకులను, విశ్రాంత ఉపాధ్యాయులు, సేవా దృక్పథం ఉన్న ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు అధికారులు. 

 

ఈ స్టడీ అవర్స్ దాదాపు 3 గంటలకు పైగా జరుగనుంది. వారికి అదనపు శక్తి కోసం స్నాక్స్ ఇవ్వనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థుల సంఖ్యను బట్టి బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 15 నుంచి రూ. 20 వరకు ఖర్చు చేసుకొనే వెసులుబాటు కల్పించనంది. టీతో పాటు స్నాక్స్ కింద దిల్ కుష్, దిల్ పసంద్, సమోసా, జిలేబీ, మిర్చీ, ఎగ్ పఫ్, కర్రీ పఫ్‌తో పాటు పంపిణీ చేస్తున్నారు. శుభ్రంగా..తాజాగా ఉన్న వాటికే అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. 

* 2017-18 విద్యా సంవత్సరంలో హాస్టల్ విద్యార్థుల ఉత్తీర్ణత 90 శాతం. 
* 2018-19 విద్యా సంవత్సరంలో 97.26 శాతం ఉత్తీర్ణత.
* ఈ ఏడాది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత ఫలితాలు తేవాలని లక్ష్యం. 

Read More : త్వరలోనే AP TET, DSC 2020