Tirumala : జులై 11న తిరుమలలో ఐదు గంటలపాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేత
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.

Tirumala Srivari
Tirumala Srivari Darshanam Suspend : తిరుమలలో జులై 11న శ్రీవారి దర్శనాలను ఐదు గంటలపాటు నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జులై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. జులై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐడు గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
Tirumala : జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు
తిరుమంజనం అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.