Statue of Equality : భగవంతుని పొందడానికి కులము,జాతి,లింగము అడ్డుకావని చెప్పిన సమతామూర్తి శ్రీరామానుజులు

నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.

Statue of Equality : భగవంతుని పొందడానికి కులము,జాతి,లింగము అడ్డుకావని చెప్పిన సమతామూర్తి శ్రీరామానుజులు

Statue of Equality

Statue of Equality :  కరోనా బాహ్య ప్రపంచంలో ప్రమాదకర వైరస్…..కానీ మనుషుల్లోని మనసుల్లో అసమానత అనే మరో వైరస్ అంతకంటే భయంకరంగా వ్యాపిస్తోందని చిన్నజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ రామానుజాచార్యుల వారు వెయ్యేళ్ల కిందటే సమానత అనే వ్యాక్సిన్ అందించారని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు జరిగే భగవద్రామానుజల సహస్రాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడుతూ ఆయన ….నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు. భగవంతుని పొందడానికి.. భక్తియే ప్రధానమని..కులము..జాతి… లింగము మొదలగునవి అడ్డుగోడలు కావని జాతి గమనాన్నినిర్దేశించిన సామాజిక విప్లవ కారులు శ్రీరామానుజులు అని ఆయన అన్నారు.
Also Read :Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!
అటువంటి మహా ప్రవక్త వెయ్యేళ్ల అవతార వేడుకల సందర్భంగా వారు సమాజానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి బోధనలను మరోక్కసారి మానవాళికి గుర్తు చేయాలని మరో వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా పునః ప్రతిష్ట చేయాలని సంకల్పించి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామానుజల వారి సమతా మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు.