Gangamma jatara :శ్రీవారి తోబుట్టువు గంగమ్మ జాతర ప్రత్యేకత..భక్తులు వేసే ప్రతి వేషాల వెనుకున్న అంతరార్థం

Gangamma jatara :శ్రీవారి తోబుట్టువు గంగమ్మ జాతర ప్రత్యేకత..భక్తులు వేసే ప్రతి వేషాల వెనుకున్న అంతరార్థం

Tirupati Gangamma Jatara

Gangamma jatara : గంగమ్మ జాతర పేరు వింటే చాలు రాయలసీమలో కోలాహలం మొదలవుతుంది. ఈ జాతరలో అమ్మవారిని ఏం కోరుకున్నా ఆ తల్లి నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం.అందుకే ప్రతిఏటా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ జాతరలో పాల్గొంటారు. మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. అమ్మవారి మొక్కుల వెనుక పెద్ద కథే ఉంది.జాతరలో విచిత్ర వేషధారణలకు అదే కారణం.

తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. గంగజాతర కేవలం తిరుమల.. తిరుపతికి మాత్రమే పరిమితం కాదు. రాయలసీమ మొత్తం ఈ సందడి కనిపిస్తుంది. గంగమ్మ కేవలం గ్రామదేవత మాత్రమే కాదు. మహిమాన్వితమైన శక్తిస్వరూపిణి. అందుకే ఈ జాతరకు అంత ప్రత్యేతక. జాతరలో భక్తులు వేసే ప్రతి వేషం వెనుక ఓ అంతరార్థం దాగి ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యులు తిరుపతి గంగమ్మ గురించి గొప్పగా వర్ణించారు. చెడును అంతం చేయడాని మానవ రూపంలో పుట్టి దుష్ట సంహారం చేశారని మనం విన్నాం. అలానే జనాలను ముఖ్యంగా మహిళల్ని
వేధింపులు గురి చేస్తున్న పాలేగాళ్లను వధించేందుకు అమ్మవారు గంగమ్మ రూపంలో అవతరించింది.

Also read : Gangamma Jatara : అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం..మగాళ్లు చీరలు కట్టుకుని మొక్కులు చెల్లించుకునే 900 ఏళ్లనాటి సంప్రదాయం

మహిళల్ని వేధించడమే కాదు.. ఏకంగా గంగమ్మను మోహించిన పాలెగాడు తన చేయి పట్టుకుని అవమానించడంతో.. అతడ్ని చంపుతానని గంగమ్మ ప్రతినబూనుతుంది. అతడిని అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. చివరకు దొరవేషం వేసిన గంగమ్మ పాలెగాడిని బూతులు తిడుతూ తిరుపతి మొత్తం గాలించిందట. అది విన్న పాలెగాడు నిజంగానే దొర వచ్చాడనుకుని.. బయటకు రావడంతో… గంగమ్మ వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. గంగమ్మ పాలెగాడ్ని పట్టుకునేందుకు ఎలాంటి వేషాలు వేసిందో.. అచ్చంగా భక్తులు కూడా జాతరలో అలాంటి వేషాలే వస్తారు. అమ్మవారు పాలెగాడ్ని తిట్టినట్లే… భక్తులు కూడా తిడతారు.

Also read : Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..

ఇక గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యం చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు మాతంగి వేషాలు వేస్తారు.గంగమ్మతల్లి వెంకన్నకు స్వయానా చెల్లెలు కావడంతో జాతర సమయంలో టీటీడీ నుంచి మొదటి సారె అందుతుంది.అప్పట్లో గంగమ్మ తల్లిని దర్శించుకున్నతర్వాతే భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేవారట. ఇప్పటికీ చాలా మంది భక్తులు ఇదే సంప్రదాయం ఫాలో అవుతుంటారు.