సెలెక్ట్ కమిటీకి పంపండి, సవరణలు చేయండి : మండలిలో టీడీపీ వ్యూహాత్మక అడుగులు

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 05:55 AM IST
సెలెక్ట్ కమిటీకి పంపండి, సవరణలు చేయండి : మండలిలో టీడీపీ వ్యూహాత్మక అడుగులు

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రూల్ 71 విషయంలో విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు మరో అస్త్రం ప్రయోగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై టీడీపీ నోటీసులు ఇచ్చింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ కు నోటీసులు ఇచ్చింది. అలాగే బిల్లులకు సవరణలు సూచిస్తూ మరో రెండు నోటీసులు ఇచ్చింది టీడీపీ. కాగా మండలిలో గందరగోళం నెలకొంది.

మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుపై టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు నిరసనకు దిగారు. లైవ్ టెలికాస్ట్ చేసే వరకు సభను జరగనివ్వబోమని పట్టు పట్టారు. దీంతో మండలి స్థంభించింది. చైర్మన్ మండలిని 15నిమిషాల పాటు వాయిదా వేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే లైవ్ ఇవ్వలేకపోతున్నామని, సరి చేస్తున్నామని మంత్రి బుగ్గన వివరించారు.