Visakhapatnam Daspalla Lands Issue : రూ.3వేల కోట్ల విలువైన దసపల్లా భూములపై మళ్లీ దుమారం.. సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్

దసపల్లా భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.

Visakhapatnam Daspalla Lands Issue : రూ.3వేల కోట్ల విలువైన దసపల్లా భూములపై మళ్లీ దుమారం.. సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్

Visakhapatnam Daspalla Lands Issue : దసపల్లా భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.

అవి ముమ్మాటికి ప్రభుత్వ భూములే అంటోంది ఏపీ సర్కార్. దసపల్లా భూములను ఎవరూ దోచుకోలేదని మంత్రులు చెబుతున్నారు. విశాఖలో దసపల్లా భూముల వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది.

విశాఖ నడిబొడ్డున ఉన్న దసపల్లా భూముల విలువ సుమారు 3వేల కోట్ల రూపాయలు. ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూములపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకి లోబడి ముందుకెళ్లాలని కలెక్టర్ ను ఆదేశించింది ప్రభుత్వం. ఈ మేరకు భూపరిపాలన ముఖ్య కమిషనర్ సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గతంలో సర్వే నెంబర్లు 1027, 1028,1196,1197లో ఉన్న దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, 2014లో అప్పటి పాలకుల ఆదేశాలతో కలెక్టర్ యువరాజ్ వాటిని ప్రభుత్వ భూముల జాబితా 22ఏలో చేర్చారు. ఆ తర్వాత తీర్పుపై అప్పీల్ చేశారు. అప్పటి నుంచి రూ.3వేల కోట్ల విలువైన సుమారు 76వేల చదరపు గజాలకు సంబంధించిన భూమిపై వివాదం కొనసాగుతోంది.

ఓవైపు దసపల్లా భూముల వివాదం కొనసాగుతుండగానే.. మరోవైపు ఆ భూములను ఓ బిల్డర్, వ్యాపారి కలిసి డెవలప్ మెంట్ కు కొనుగోలుదారులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అందులో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి డిజైన్ సిద్ధం చేశారు. ఆ భూములు 22ఏ లో ఉండటంతో వాటిపై డెవలప్ మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రర్ చేయడం కుదరదని అధికారులు చెప్పినా.. వినకుండా ఒత్తిళ్లు తెచ్చి పెండింగ్ రిజస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖ వాటిని తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే వాటిని ప్రైవేట్ కు అప్పగించేందుకు పాత తీర్పులను ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లాలని కలెక్టర్ కు సూచించింది. దాంతో ఆ భూములు చేతులు మారిపోయే పరిస్థితి ఏర్పడిందని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.

గతంలో రాణి కమలాదేవికి అనుకూలంగా వచ్చిన తీర్పును చూపించి నగరంలోని ప్రముఖులతో 300 గజాల నుంచి వెయ్యి గజాల చొప్పున కొందరు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టారు. వాటిని రిజిస్ట్రర్ చేయడానికి అధికారులు నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వులు చూపించి రిజిస్ట్రేషన్ చేయించారు.

కాగా, దసపల్లా భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా కట్టడాలు కడితే.. ట్విన్ టవర్స్ కూల్చినట్టు.. ఈ నిర్మాణాల కూల్చివేతకు పోరాటం చేస్తామని బీజేపీ హెచ్చరించింది.