KCR-Jagan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌

తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని తెలిపారు.

KCR-Jagan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌

Ugadi

Telugu states CMs KCR and Jagan : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలని ప్రార్థించారు కేసీఆర్‌. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని అన్నారు.

తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని సీఎం కేసీఆర్‌ అన్నారు . అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని తెలిపారు.

Ugadi 2022: తెలుగు వారి సంవత్సరాది ఉగాది.. షడ్రుచుల కలబోత ఈ పర్వదినం!

శుభకృత్ నామ సంవత్సరంలో ఏపీ ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరుకున్నారు. పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు.

ఉగాది సందర్భంగా తాడేపల్లిలో జరగనున్న వేడుకలకు సీఎం జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. ఉదయం 10.36కి పంచాంగ పఠనంలో సీఎం దంపతులు పాల్గొంటారు. పంచాంగ పఠనం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశారు.