AP Government : వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌, ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల పేర్లను అవార్డుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణ మోహన్ సెక్రటేరియేట్ లో ప్రకటించించారు.

AP Government : వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌, ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

The Ap Government Announced Ysr Lifetime Achievement And Ysr Achievement Awards

AP Government : వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల పేర్లను అవార్డుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణ మోహన్ సెక్రటేరియేట్ లో ప్రకటించించారు. మొత్తంగా 63 అవార్డులను ప్రకటించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ కు, అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకూ పురస్కారాలు ఇవ్వనుంది. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరణ చేయనున్నారు. వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరించనుంది.

2019 నవంబర్ లోనే ఘనమైన సేవలు అందించే వారికి ఈ అవార్డులు ఇవ్వాలని సిఎం జగన్ ఆలోచన అని జివిడి కృష్ణ మూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కలెక్టర్ లు ఈ అవార్డుల ఎంపిక కు పేర్లను పంపించారని, మరి కొందరు స్వయంగా వారి పేర్లు పంపించారని తెలిపారు. మన కల్చర్ మీద కమిటీ ఫోకస్‌ పెట్టిందని చెప్పారు. సామాన్యుల్లో ఉన్న‌ అసామాన్యులను కమిటీ గుర్తించిందన్నారు.

సంస్థలు (అన్నింటికీ లైఫ్‌ టైమ్‌)
1) ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ట్రస్ట్‌ – కాకినాడ, తూర్పు గోదావరి
2) సీపీ బ్రౌన్‌ లైబ్రరీ– వైఎస్సార్‌ జిల్లా
3) సారస్వత నికేతన్‌ లైబ్రరీ– వేటపాలెం,ప్రకాశం
4) శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – అనంతపురం
5) ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ – వైఎస్సార్‌ జిల్లా
6) రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌– అనంతపురం
7) శ్రీ గౌతమి రీజినల్‌ లైబ్రరీ– రాజమండ్రి, తూర్పుగోదావరి
8) మహారాజాస్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌– మ్యూజిక్‌– విజయనగరం

రైతులు
1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్‌ టైమ్‌) – కడియం నర్సరీల వ్యవస్థాపకుడు
2) మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం
3) శ్రీ ఎం.సి.రామకృష్ణారెడ్డి – అనంతపురం
4) శ్రీ కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం
5) శ్రీ విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా
6) శ్రీ ఎం.బలరామిరెడ్డి – వైఎస్సార్‌జిల్లా
7) శ్రీ ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు
8) శ్రీ సెగ్గె కొండల్‌రావు – విశాఖపట్నం
9) ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫార్మింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ – విశాఖపట్నం
10) శ్రీ వల్లూరు రవికుమార్‌ – కృష్ణా
11) శ్రీ శివ అభిరామరెడ్డి – నెల్లూరు

కళాకారులు
1) పొందూరు వస్త్రాలు– ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం–లైఫ్‌ టైం– శ్రీకాకుళం
2) జానపద గేయం– స్వర్గీయ వంగపండు ప్రసాదరావు–లైఫ్‌ టైం– విజయనగరం
3) బొబ్బిలి వీణ– శ్రీ బొబ్బిలివీణ కేంద్రం (శ్రీ అచ్చుత నారాయణ)–లైఫ్‌ టైం– విజయనగరం
4) «ధింసా నృత్యం– కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం – విశాఖపట్నం
5) రంగస్థలం– శ్రీ పొన్నాల రామసుబ్బారెడ్డి– లైఫ్‌ టైం – నెల్లూరు
6) సురభి నాటకం– (శ్రీ వినాయక నాట్య మండలి) – సురభి డ్రామా– లైఫ్‌ టైం –ౖవైయస్సార్‌ జిల్లా
7) సవర పెయింటింగ్స్‌ – శ్రీ సవర రాజు – శ్రీకాకుళం
8) వీధి నాటకం– శ్రీ మజ్జి శ్రీనివాసరావు – విశాఖపట్నం
10) డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌– శ్రీ ధర్మాడి సత్యం – తూర్పు గోదావరి
11) హరికథ– శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) – తూర్పు గోదావరి
12) బుర్రకథ– శ్రీ మిరియాల అప్పారావు – పశ్చిమ గోదావరి
13) కొండపల్లి బొమ్మలు – శ్రీ కూరెళ్ల వెంకటాచారి– కృష్ణా
14) డప్పు కళాకారుడు– శ్రీ గోచిపాత గాలేబు – కృష్ణా
15) వెంకటగిరి జమదానీ చీరలు– శ్రీ జి.రమణయ్య– నెల్లూరు
16) కలంకారీ పెయింటింగ్స్‌– శ్రీ శివప్రసాదరెడ్డి– కర్నూలు
17) ఉడ్‌ కార్వింగ్స్‌– శ్రీ బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్జిజాన్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌– చిత్తూరు
18) లెదర్‌ పప్పెట్రీ– శ్రీ దాలవాయి చలపతి– లైఫ్‌ టైం– అనంతపురం
19) నాదస్వరం– డాక్టర్‌ వి.సత్యనారాయణ– చిత్తూరు
20) కేలిగ్రఫీ– పూసపాటి పరమేశ్వరరాజు– విజయనగరం
21) కూచిపూడి నాట్యం– సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం–లైఫ్‌ టైం– కూచిపూడి– కృష్ణా జిల్లా

రచయితలు (అందరికీ లైఫ్‌ టైం)
1) స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్‌)– శ్రీకాకుళం
2) శ్రీ కత్తి పద్మారావు – అభ్యుదయ సాహిత్యం –గుంటూరు
3) శ్రీ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి– సాహిత్యం – వైఎస్సార్‌ జిల్లా
4) శ్రీ బండి నారాయణస్వామి – సాహిత్యం– అనంతపురం
5) శ్రీ కేతు విశ్వనాథరెడ్డి – సాహిత్యం– వైఎస్సార్‌ జిల్లా
6) శ్రీ కొనకలూరి ఇనాక్‌ – సాహిత్యం– గుంటూరు
7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) – సాహిత్యం– గుంటూరు

పాత్రికేయులు (అందరికీ లైఫ్‌ టైం)
1) శ్రీ పాలగుమ్మి సాయినాథ్‌ – చెన్నై
2) శ్రీ ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా
3) స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు
4) స్వర్గీయ షేక్‌ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ) – గుంటూరు
5) స్వర్గీయ కె.అమర్‌నాథ్‌ – పశ్చిమ గోదావరి
6) శ్రీ సురేంద్ర –కార్టూనిస్ట్‌ –కడప
7) శ్రీ తెలకపల్లి రవి – కర్నూలు
8) శ్రీ ఇమామ్‌ – అనంతపురం

కోవిడ్‌ వారియర్స్‌
1) డాక్టర్‌ నీతిచంద్ర – ప్రొఫెసర్‌ పల్మనాలజీ – నెల్లూరు
2) డాక్టర్‌ కె.కృష్ణకిషోర్‌ – ప్రొఫెసర్‌ ఈఎన్‌టీ – కాకినాడ
3) శ్రీమతి లక్ష్మి – స్టాఫ్‌ నర్స్‌ – జీజీహెచ్‌. విజయవాడ
4) కె.జ్యోతిర్మయి – స్టాఫ్‌ నర్స్‌ – అనంతపురం
5) తురుబిల్లి తేజస్వి – స్టాఫ్‌ నర్స్‌ – విశాఖపట్నం
6) ఎం.యోబు – మేల్‌ నర్సింగ్‌ – నెల్లూరు
7) అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ – గుంటూరు
8) ఆర్తి హోమ్స్‌ – వైఎస్సార్‌ కడప