AP Govt : ఉద్యోగుల ఉచిత వసతి పొడిగింపు

ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవోలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలలపాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

AP Govt : ఉద్యోగుల ఉచిత వసతి పొడిగింపు

Employees

AP government : హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి జూన్‌ 30 వరకు ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

3 Capitals : అమరావతి నిర్మాణంపై సజ్జల హాట్ కామెంట్స్.. కొత్త జిల్లాల కసరత్తు పూర్తి

ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవోలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలలపాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.