Uyyuru Srinivas Remand Reject : గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఉయ్యూరు శ్రీనివాస్ రిమాండ్ ను తిరస్కరించిన న్యాయమూర్తి

ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Uyyuru Srinivas Remand Reject : గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఉయ్యూరు శ్రీనివాస్ రిమాండ్ ను తిరస్కరించిన న్యాయమూర్తి

srinivas (1)

Uyyuru Srinivas Remand Reject : ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304 సెక్షన్ నుంచి మినహాయింపు లభించింది. రూ.25 వేల రూపాయల స్వయం పూచికత్తుతో శ్రీనివాస్ ను విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పోలీసుల విచారణను శ్రీనివాస్ సహకరించాలని ఆదేశించారు. కోర్టు తీర్పు మేరకు అర్ధరాత్రి ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు విడుదల చేశారు.

అంతకముందు తీవ్ర ఉద్రిక్తత మధ్య ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో ఆయనకు వైద్య చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయాక న్యాయమూర్తి ఎదుట శ్రీనివాస్ ను పోలీసులు హాజరుపర్చారు. రాత్రి 11.50 గంటలకు జడ్జి ఎదుట పోలీసులు ఉయ్యూరు శ్రీనివాస్ ను ప్రవేశ పెట్టారు. దీంతో విచారించిన న్యాయమూర్తి శ్రీనివాస్ ను విడుదల చేయాలని ఆదేశించారు. ఇక ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఆదివారం జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

Vuyyuru Srinivas Arrest : గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఏ-1 ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్, నెక్ట్స్ ఎవరు?

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఆ తర్వాత పంపిణీ కార్యక్రమం నిర్వహించగా తొక్కిసలాటతో ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో ఫౌండేషన్ నిర్వహకులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. న్యాయూమూర్తి ఎదుట పోలీసులు, శ్రీనివాస్ తరపు న్యాయవాదుల మధ్య వాదనలు వాడి వేడిగటా జరిగాయి. కేసుకు సంబంధం లేని సెక్షన్ నమోదు చేశారని శ్రీనివాస్ న్యాయవాదులు వాదించారు.

పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టలేదని లాయర్ కృష్ణారెడ్డి తెలిపారు. అధిక నేరారోపణ చేసే సెక్షన్ల కింద కేసులు నమోదు చశారని పేర్కొన్నారు. ముందే చనిపోతారని ఎలా పంపిణీ చేపడతారని ప్రశ్నించారు. కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని వాదనలు వినిపించారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఉయ్యూరు శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిలిచిపోయిన కానుకలను ప్రజల ఇంటికి చేర్చుతామని చెప్పారు. న్యాయమే గెలిచిందని టీడీపీ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారని దేవినేని ఉమ పేర్కొన్నారు.