Vuyyuru Srinivas Arrest : గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఏ-1 ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్, నెక్ట్స్ ఎవరు?

గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Vuyyuru Srinivas Arrest : గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఏ-1 ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్, నెక్ట్స్ ఎవరు?

Vuyyuru Srinivas Arrest : గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న తొక్కిసలాట ఘటనపై ఉయ్యూరు శ్రీనివాస రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1గా శ్రీనివాస రావు పేరుని చేర్చారు.

న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని శ్రీనివాస రావు నిర్వహించారు. కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు కీలక నిందితుడిగా పేర్కొంటున్నారు. అతడిపై 304 సెక్షన్ కింద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడ్డ వారు కూడా కొన్ని కేసులు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ పై 304 సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా ఉయ్యూరు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. ఉదయం నుంచి పోలీసు బృందాలు గాలించాయి. ఏలూరు రోడ్ లో శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ను గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు.

Also Read..Stampede In Guntur: చంద్రబాబు సభలో మరోసారి కలకలం… తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి

ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. అధికార వైసీపీ.. టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చేసింది. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫ్యలమే కారణం అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొన్న కందుకూరులో, ఇప్పుడు గుంటూరులో.. ఇలా తొక్కిసలాట ఘటనలు జరగడానికి కారణాలు ఏంటో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఎస్పీని కోరారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోనే ఎందుకు చేపట్టారు? ఈ అంశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. కాగా, నిన్నటి ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము భద్రత కల్పించాలని, అయితే నిర్వాహకుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. అక్కడికి 30వేల మంది ప్రజలు వచ్చినప్పుడు.. కనీసం 100 మంది పోలీసులు కూడా బందోబస్తుకు రాలేదని టీడీపీ నేతలు అంటున్నారు. కందుకూరులో కూడా పోలీసుల వైఫల్యం వల్లే 8మంది చనిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మొత్తంగా గుంటూరు తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని అధికార పక్షం కావొచ్చు, పోలీసులు కావొచ్చు.. ప్రాథమికంగా తేల్చారు. కాగా, తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ చెరో 20లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.

Also Read..Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈసారి గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు.

గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత చంద్రన్న కానుక పంపిణీ ప్రారంభించారు. కానుకలు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. వారంతా ఎగబడటతో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళ స్పాట్ లోనే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను గోపిశెట్టి రమాదేవి, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమాగా గుర్తించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు. కానుకల కోసం మహిళలు ఎగబడ్డారు. దీంతో ఘోరం జరిగిపోయింది.