Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు

ఈ నేపథ్యంలో కోడి పందాల్లో తాను లేనని చింతమనేని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. పోలీసులు, మీడియాపై చింతమనేని చిందులు వేశారు. ఈక్రమంలో కోడిపందాల శిబిరం వద్ద చింతమనేని ఉన్నాడనే వీడియో వైరల్‌గా మారింది.

Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు

Chinthamaneni Prabhakar : టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోడి పందాల నుంచి పారిపోతున్న వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్‌ పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు.

ఈ నేపథ్యంలో కోడి పందాల్లో తాను లేనని చింతమనేని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. పోలీసులు, మీడియాపై చింతమనేని చిందులు వేశారు. ఈక్రమంలో కోడిపందాల శిబిరం వద్ద చింతమనేని ఉన్నాడనే వీడియో వైరల్‌గా మారింది. కోడిపందాల శిబిరం నుంచి చింతమనేని పారిపోతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Chintamaneni Prabhakar : కోడి పందాలతో నాకేం సంబంధం లేదు-చింతమనేని

దీంతో పటాన్ చెరు పోలీసులు కోడి పందాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చింతమనేని ఉన్న వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. కోడిపందాల బెట్టింగ్‌ కేసులో చింతమనేనిని ఏ1గా నిర్ధారించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 21 మంది బెట్టింగ్‌ రాయుళ్లను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.