Union Home Ministry : ఏపీకి కేంద్రం షాక్.. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగింపు

ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసి విభజన సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. అయితే, అజెండాలో మొదట చేర్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించింది.

Union Home Ministry : ఏపీకి కేంద్రం షాక్.. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగింపు

Ap

Union Home Ministry : ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పు చేసింది. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తొలగించింది. హోదాతోపాటు పన్ను రాయితీ అంశాలు కూడా తొలగించింది. అజెండాలో మార్పు చేస్తూ కేంద్ర హోంశాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఆ మేరకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.

ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేసి విభజన సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. అయితే, అజెండాలో మొదట చేర్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించింది. మొత్తం 9 అంశాలకు గానూ ఇప్పుడు చర్చలను ఐదు అంశాలకే పరిమితం చేసినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులకు సమాచారం అందింది. కేంద్ర హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు. ఇద్దరు సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు.

East Godavari : కొడుకును కాపాడబోయి తండ్రి మృతి

ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హోంశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పెద్దలు విన్నవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తే తల నొప్పులు వస్తాయన్న యోచనతో కేంద్రం తాజాగా అజెండాలోని ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. అజెండాలో తొలుత పెట్టిన ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడంతో ఏపీలోని జగన్‌ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఉన్నట్లుండి అజెండాలో మార్పు చేయడంతో జగన్‌ ప్రభుత్వం పెద్దలు ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.