జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్: బెయిల్ వచ్చి 24 గంటలుకాలేదు..మరో మూడు కేసులు jc prabhakar reddy

జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్: బెయిల్ వచ్చి 24 గంటలుకాలేదు..మరో మూడు కేసులు

జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్: బెయిల్ వచ్చి 24 గంటలుకాలేదు..మరో మూడు కేసులు

జేసీ కుటుంబానికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సంతకం చేసేందుకు అనంతపురం వన్ టౌన్ పీఎస్ కు వెళ్లారు. అయితే సంతకాలు పెట్టడం పూర్తై 2 గంటలైనా వారిని పోలీసులు బయటకు పంపలేదు. నిన్న జైలు నుంచి విడుదలైన సందర్భంగా హంగామా చేయడంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు చేశారు. మరో 31 మందిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారున్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరించారు.అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాల అక్రమ రవాణా కేసులో నిన్న బెయిల్ విడుదలైన సందర్భంగా కడప జైలు నుంచి తాడిపత్రి వెళ్తున్న క్రమంలో జేసీ భారీ కాన్వాయ్ నిర్వహించారు. అయితే భారీ కాన్వాయ్ కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అయితే తమ కాన్వాయ్ ని ఎందుకు అడ్డుకుంటున్నారు, మీకు ఏమీ హక్కు ఉందంటుూ సీఐ, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అలాగే కోవిడ్ నిబంధనలు అతిక్రమించారంటూ తాడిపత్రి పోలీసలు మూడు కేసులు నమోదు చేశారు.

అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కండీషన్ బెయిల్ పై సంతకం చేయడం కోసం వచ్చిన జీసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి సంతకాల సేకరణ పూర్తైనా గానీ రెండు గంటలుగా స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. ఈ రోజు నమోదైన మూడు కేసులపై ఇక్కడే విచారణ చేపట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసులుకరోనా నిబంధనలు అతిక్రమించి భారీ కాన్వాయ్ లో పాల్గొన్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా వేలాదిగా అనుచరులు, అభిమానులు వచ్చారని…అలాగే విధులు నిర్వహిస్తున్న సీఐని అడ్డుకునే విషయంలో జేసీపై ఐపీసీ 353తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటివరకు బయటకు చెప్పలేదు.

ఈ కేసుల్లో భాగంగానే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారించి తదనంతరం వారిని అరెస్టు చేస్తారా..లేదా బెయిల్ ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సివుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్పెషట్ పార్టీ పోలీసులు, భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టుగా సమాచారం.

×