Tirumala : తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ధ్వంసం.. రిపేర్ అయ్యాకే భక్తులకు అనుమతి

శ్రీవారి మెట్టు నడక దారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. నీటి ప్రవాహం కారణంగా పెద్ద పెద్ద రాళ్లు, మట్టి నడక దారిలో పేరుకుపోయాయి.

Tirumala : తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ధ్వంసం.. రిపేర్ అయ్యాకే భక్తులకు అనుమతి

Tirumala Srivari Mettu Margam Rain

Tirumala : శ్రీవారి భక్తులకు ఇబ్బందులు ఇప్పట్లో తప్పేలా లేవు. ఊహించని రీతిలో కురుస్తున్న భారీవర్షాలు… భారీ వరదలతో స్థానికులు, భక్తులకు అనుకోని అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. వరద నీరు పోటెత్తడం, కొండ చరియలు విరిగిపడటంతో…. శ్రీవారి నడక దారి, ఘాట్ రోడ్లలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. శ్రీవారి ఘాట్ రోడ్ లలో కొండచరియలు తొలగించడంతో… వాహనాలకు ప్రస్తుతానికి అనుమతి ఇస్తున్నారు అధికారులు.

Read This : Pushpa : ‘పుష్ప’ సాంగ్ కోసం తన రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్

తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గం .. ఇటీవలి వర్షాలు, వరదలకు భారీగా దెబ్బతిన్నది. ఈ దారిని పరిశీలించారు టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి. “శ్రీవారి మెట్టు నడక దారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. నీటి ప్రవాహం కారణంగా పెద్ద పెద్ద రాళ్లు, మట్టి నడక దారిలో పేరుకుపోయాయి. నడకదారి మొత్తాన్ని రిపేర్ చేసిన తర్వాతే భక్తులను అనుమతిస్తాం. అలిపిరి మెట్ల మార్గంలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప పెద్దగా ఎటువంటి నష్టం జరగలేదు. వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందుగానే నడక మార్గంలో భక్తులను నిలిపివేశాం. నడక మార్గంలో భక్తులను నిలిపివేయడం వల్లే ప్రాణ నష్టం, భారీ ప్రమాదం తప్పింది” అని టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి చెప్పారు.

Nayanatara : చిరంజీవి సినిమాలో నయన్‌కి భారీ పారితోషికం

తిరుమలలో భారీవర్షాలతో… వరద నీరు దిగువ ప్రాంతమైన తిరుపతి పరిసరాలను ముంచేసింది. దీంతో… నడక దారిని మూసేశారు అధికారులు. ప్రస్తుతానికి అలిపిరి నడక దారి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్ లోనూ వాహనాల్లో తిరుమల దర్శనానికి వెళ్లొచ్చని అధికారులు తెలిపారు.