Tirumala Tirupati : తిరుపతి గంగమ్మ ఆలయంలో వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవం

గత ఏడాది ప్రారంభమైన గంగమ్మ ఆలయ పున: నిర్మాణం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. బాలాలయం నుంచి తిరిగి యధాస్థితిలోకి గంగమ్మ తల్లి కొలువుదీరనుంది. ఈనెల 9వ తేదీన గంగమ్మ జాతరకు చాటింపు ఉంటుంది. వారం రోజులు పాటు ఈ వేడుక కొనసాగుతుంది. ఈనెల 16న గంగమ్మ జాతర జరుగుతుంది.

Tirumala Tirupati : తిరుపతి గంగమ్మ ఆలయంలో వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవం

Gangamma Thalli

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి చెల్లెలుగా, తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఉదయం నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి వేద పడింతుల మంత్రోచ్చారణల నడుమ పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ మహోత్సవానికి కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి హాజరయ్యారు. ఆలయంలో గంగమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, శిఖర కలశ, స్థిర ప్రతిష్టా కుంభాభిషేక వేడుక జరుగుతుంది. విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా సాంప్రదాయ బద్దంగా మహాకుంభాభిషేకం కొనసాగుతుంది. ఈ వేడుకలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు.

Karnataka Elections: ప్రధాని ‘జై బజరంగ్ బలి’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌నూ వదల్లేదు..

గత ఏడాది ప్రారంభమైన గంగమ్మ ఆలయ పున: నిర్మాణం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. బాలాలయం నుంచి తిరిగి యధాస్థితిలోకి గంగమ్మ తల్లి కొలువుదీరనుంది. ఈనెల 9వ తేదీన గంగమ్మ జాతరకు చాటింపు ఉంటుంది. వారం రోజులు పాటు ఈ వేడుక కొనసాగుతుంది. ఈనెల 16న గంగమ్మ జాతర జరుగుతుంది. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రథమ శిష్యుడైన అనంతాళ్వార్ వారి అమృత హస్తాలతో సుమారు 1,400 ఏళ్ల క్రితం గంగమ్మ ఆలయాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొలినాళ్లలో సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతి నగరంలోని గంగమ్మను దర్శించి తర్వాత తిరుమల వెంకన్నను దర్శించే సంప్రదాయం కొనసాగేది. తర్వాత అది కాలక్రమేణ కనుమరుగైంది.

Ramabanam : రామబాణం ట్విట్టర్ రివ్యూ.. రామబాణం గురి తప్పిందా? తగిలిందా?..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానంద స్వామిజీ ..

తిరుమల శ్రీవారిని విశాఖ శారదా పిఠాధిపతి స్వరూపానంద స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామిజీలు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామిజీ మాట్లాడుతూ.. దేవాదాయశాఖ పనితీరు ఎలావుందో ఆ శాఖ మంత్రిని అడిగితే చెబుతారు. నేను తిరుమల దర్శనానికి వచ్చాను అంటూ పేర్కొన్నారు. వేదాలు పరిరక్షణచేసే దేవుడు వేంకటేశ్వర స్వామివారు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 వేదపారాయణదారుల పోస్టులు భర్తీ చెయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. అన్యమతస్థులుగా హిందువులు మారకూండా ఉండడానికి గిరిజవ ప్రాంతాలలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తోందని చెప్పారు.