Tirupati Lok Sabha : తిరుపతిలో వైసీపీ ఘన విజయం..గురుమూర్తి ఎవరు ?

తిరుపతిలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి..డాక్టర్ గురుమూర్తిని ప్రజలు గెలిపించారు.

Tirupati Lok Sabha : తిరుపతిలో వైసీపీ ఘన విజయం..గురుమూర్తి ఎవరు ?

Tirupati Lok Sabha Elections Gurumurthy Won

Dr. Gurumurthy : అనుకున్నట్లుగానే..తిరుపతిలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి..డాక్టర్ గురుమూర్తిని ప్రజలు గెలిపించారు. 2,71,592 ఓట్లతో ఆయన విజయం సాధించారు. తిరుపతి బై పోల్ లో అనూహ్యంగా గురుమూర్తిని పోటీలో నిలిపింది. అసలు ఈయన ఎవరు ?

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామంలో దళితవాడకు చెందిన మద్దిల గురుమూర్తి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఈయన తండ్రి ముని కృష్ణయ్య. తల్లి రమణమ్మ. ముని కృష్ణయ్య రెండకరాల పొలం ఉంది. 1975లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పట్టా ఇచ్చారు. గురుమూర్తికి ఐదుగురు అక్కా చెల్లెల్లు ఉన్నారు.

ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక, ఆరు నుంచి 10వ తరగతి వరకు బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఆ తర్వాత ఇంటర్‌ తిరుపతిలో చదువుకున్నారు. తర్వాత..స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నారు గురుమూర్తి. సీఎంగా ఉన్న దివంగత వైఎస్ ను తరచూ కలిసి వచ్చేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ…వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు.

ఇక 2017లో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో జగన్ వెంటే ఉన్నారు గురుమూర్తి. నవంబర్‌ 2017- జనవరి 2019 వరకు 3,648 కి.మీ ఈ పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో ఆయన వెంట నడిచిన గురుమూర్తి..ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్‌ గురుమూర్తిని తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. గురుమూర్తిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుకున్నట్లుగానే..గురుమూర్తిని ప్రజలు ఆదరించారు.

Read More :Nandigram : నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం..సుప్రీంకోర్టుకి మమత