టీటీడీ స్థిరాస్తులపై శ్వేతపత్రం…1,128 ఆస్తుల జాబితా విడుదల

  • Published By: bheemraj ,Published On : November 28, 2020 / 06:13 PM IST
టీటీడీ స్థిరాస్తులపై శ్వేతపత్రం…1,128 ఆస్తుల జాబితా విడుదల

White Paper release TTD Assets : తిరుమల శ్రీవారి స్థిరాస్తుల ముసాయిదాపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారి 1,128 ఆస్తుల జాబితాను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం (నవంబర్ 28, 2020) విడుదల చేశారు. 2014 వరకు వేంకటేశ్వరుని పేరిట 8,088 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. అయితే ప్రస్తుతం శ్రీవారి పేరిట మొత్తం 7,753 ఎకరాల భూములు ఉన్నాయి. శ్రీవారి ఆస్తుల్లో 2014 వరకూ 335.23 ఎకరాలను అమ్మేశారు.



శ్రీవారి పేరిట 2014 వరకూ 2,085 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. శ్రీవారి పేరిట ప్రస్తుతం 1,792 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. శ్రీవారి పేరిట 2014 వరకు 6,003 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ప్రస్తుతం వేంకటేశ్వుని పేరిట 5,961 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వ్యవసాయ ఆస్తులు 233, వ్యవసాయేతర ఆస్తులు 985. 1974-2014 వరకు విక్రయించిన ఆస్తులు 141, విస్తీర్ణము 335.23 ఎకరాలు.



వ్యవసాయ ఆస్తుల సంఖ్య 61, విస్తీర్ణము 293.02. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 80, విస్తీర్ణము 42.21 ఎకరాలు. ఆస్తులు విక్రయించగా టీటీడీకి రూ.613 కోట్ల ఆదాయం వచ్చింది.

నేటికి టీటీడీ నికర ఆస్తుల సంఖ్య 987, విస్తీర్ణము 7,753.66 ఎకరాలు. వ్యవసాయ ఆస్తుల సంఖ్య 172, విస్తీర్ణము 1792.39 ఎకరాలు. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 815, విస్తీర్ణము 5,961.27 ఎకరాలు.



www.tirumala.org వెబ్ సైట్ లో టీటీడీ ఆస్తుల వివరాలను పొందుపరిచారు. త్వరలో శ్రీవారి ఆస్తుల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆస్తుల పర్యవేక్షణకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేయనుంది.